జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్ కు చిరంజీవి మద్దతుపై గందరగోళం మొదలైంది.  మూడు రాజధానుల కాన్సెప్ట్ కు మద్దతుగా వ్యతిరేకంగా రెండు రోజుల్లో రెండు ప్రకటనలు విడుదల అవటం చివరకు మూడో ప్రకటనతో మళ్ళీ క్లారిటి రావటంతో జనాల్లో గందరగోళం పెరిగిపోతోంది. మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ది జరుగుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

 

రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చేయటానికి జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు తాను మద్దతు పలుకుతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి స్పష్టంగా ప్రకటించారు. అయితే తర్వాత తాను మద్దతు ప్రకటించలేదని చిరంజీవి పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. తాను సినీరంగానికి సంబంధించిన వాడినని ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటనలో ఉంది.

 

తన దృష్టి మొత్తం ప్రస్తుతం సినీరంగం మీద మాత్రమే ఉందని ఆదివారం విడుదలైన ప్రకటనలో చిరంజీవి చెప్పటం గమనార్హం.  ఎప్పుడైతే రెండు రోజుల్లో రెండు ప్రకటనలు చిరంజీవి పేరుతోనే విడుదలైందో అభిమానులతో పాటు రాజకీయ నేతల్లో కూడా అయోమయం మొదలైంది.  చివరకు ఆదివారం రాత్రికి మూడో ప్రకటన విడుదలైంది. మొదటి ప్రకటనే వాస్తవమని రెండో ప్రకటన అబద్ధమంటూ క్లారిటి ఇచ్చారు. మొత్తానికి చిరంజీవి పేరుతో జగన్ ప్రతిపాదనపై అసలు ఇంత గందరగోళం ఎందుకు జరిగింది ?

 

ఇపుడిదే అంశం సంచలనంగా మారింది. ఈ మొత్తం మీద తెలుగుదేశంపార్టీ నేతలున్నారంటూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జగన్ ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడుతున్న విషయం తెలిసిందే.  అదే సమయంలో చిరంజీవి మద్దతు ప్రకటించటాన్ని టిడిపి సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుపడుతున్నారు.

 

జగన్ ప్రతిపాదనను పవన్ ఎలా వ్యతిరేకిస్తున్నారో చిరంజీవి అలాగే మద్దతు పలుకుతున్నారన్న కనీస ఇంగితం కూడా టిడిపి నేతలు కోల్పోయారు. అందుకనే ఉద్దేశ్యపూర్వకంగా అందరిలోను గందరగోళం సృష్టించటానికి టిడిపినే తెర వెనుక ప్రయత్నాలు చేసినట్లు అనుమానంగా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: