తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజుల క్రితం తెర మీదికి వచ్చిన అంశం.. ఇంకొన్ని రోజుల్లో కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని ఆ పదవిని తన రాజకీయ వారసుడు  కేటీఆర్ కు  ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది.. అటు టీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ఇండైరెక్ట్ గా  దీనికి సంబంధించి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు  ముఖ్యమంత్రి పదవి ఇచ్చి... ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్... ప్రభుత్వానికి ఉన్నతస్థాయి సలహాలు ఇచ్చేందుకు ఓ కమిటీని నియమించి ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారు అంటూ ప్రచారం జరిగింది. మరోవైపు  టీఆర్ఎస్ నేతలు కూడా పలుమార్లు రాష్ట్రం మొత్తం యువ నాయకత్వాన్ని కోరుకుంటుంది అంటూ వ్యాఖ్యానించడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. 

 

 ఇకపోతే తాజాగా ఈ అంశంపై కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. త్వరలో  ముఖ్యమంత్రి కేసీఆర్ వారసులైన కేటీఆర్ కవితలలో  ఎవరో ఒకరు సీఎం అవుతారు అంటూ వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రస్తుతం కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు టీఆర్ఎస్ లో  కూడా ఆసక్తిని రేపుతున్నాయి. త్వరలో కెసిఆర్ సీఎం అవుతారని ఓ వైపు ప్రచారం జరుగుతుంటే.. ఇప్పుడు కేటీఆర్ కవిత లో ఎవరో ఒకరు సీఎం అవుతారని కామెంట్ చేయడంతో ఈ అంశం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. 

 

 టిఆర్ఎస్ లో భారీ చీలిక ఏర్పడిందని... ఈ నేపథ్యంలోనే కెసిఆర్ రాజకీయ వారసులైన కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ కెసిఆర్ ఒకే ఇంట్లో ఉంటున్నారని దీనివల్ల కెసిఆర్ ప్రాణానికి ముప్పు ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలంటు  గతంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు రేవంత్ రెడ్డి. కాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: