మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూను తీసుకొచ్చినట్టు సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ ప్రకటించారు. గోరుముద్ద పేరుతో ఈ స్కీమ్ కు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. పేద పిల్లలకు జగన్ మామ తోడుగా ఉంటారని భరోసా ఇచ్చారు. 

 

మధ్యాహ్న భోజన పథకం "జగనన్న గోరుముద్ద" వివరాలు ఓ సారి పరిశీలిస్తే..  

సోమవారం : అన్నం, చారు, కోడి గుడ్డు కూర, స్వీట్, చిక్కీ 
మంగళవారం : పులిహోర, టమాటో పప్పు, గుడ్డు 
బుధవారం : వెజిటెబుల్ రైస్, ఆలూ కుర్మా, గుడ్డు, స్వీట్, చిక్కీ 
గురువారం : కిచిడీ, టమోటా చట్నీ, గుడ్డు 
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, స్వీట్, చిక్కీ
శనివారం :  అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్...

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కొత్త మెనూ గత మంగళవారం నుంచి అమలైంది. గోరుముద్ద పథకానికి అదనంగా 353 కోట్ల రూపాయలు కేటాయించారు. మెనూ ప్రకారం వారంలో ఐదు రోజుల పాటు గుడ్డు అందించనున్నారు. 

 

అంతేకాదు మధ్యాహ్నం భోజన పథకం ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని వెయ్యి రూపాయల నుంచి 3వేల రూపాయలకు  పెంచినట్లు సీఎం జగన్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వానికి రూ. 344 కోట్ల అదనపు భారం పడుతోంది. అలాగే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను తీసుకొస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. పాఠశాల అభివృద్ధి కమిటీ నుంచి ముగ్గురికి పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తామన్నారు. వారితో పాటు వార్డు, గ్రామ సచివాలయంలో ఉండే విద్య, సంక్షేమ అధికారి నాణ్యతను పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రోజువారీ నివేదికను అందజేసేలా చర్యలు చేపడతామన్నారు. వీరందరిపై ఆర్డీవో స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. 

 

మొత్తానికి జగన్ పిల్లలకు నాణ్యమైన భోజనం వసతి కల్పించడంతో పాటు.. తల్లులకు అమ్మఒడి ద్వారా 15వేల రూపాయలు ఇస్తున్నారు. విద్యను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రెండు పథకాలతో ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆస్వాదిస్తూ చేతులెత్తి మొక్కుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: