తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ వారసుడైన కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అటు పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా ఇండైరెక్ట్గా  కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అంటూ వ్యాఖ్యానించారు కూడా. రాష్ట్ర ప్రజానీకం మొత్తం యువ  నాయకత్వం వైపు ఆశగా చూస్తుంది అని పలు ప్రసంగాలలో ఇండైరెక్ట్గా కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ ప్రచారం ఊపందుకుంది. 

 

 

 ఇకపోతే దీనికి సంబంధించి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 90 శాతానికి పైగా మున్సిపాలిటీల్లో ఆర్ఎస్ జెండా ఎగిరింది. మున్సిపల్ ఎన్నికల్లో  టిఆర్ఎస్ పార్టీ అసామాన్య విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే తెరాస  వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పనితీరు వల్ల మున్సిపల్ ఎన్నికల్లో  టిఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని నమోదుచేసింది అంటూ గంగుల కమలాకర్ అన్నారు. కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్... సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పనితీరు చరిత్రలో నిలిచిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. 

 

 

 అయితే వచ్చే 40 ఏళ్లపాటు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించిన మంత్రులు గంగుల కమలాకర్.. దేశమంతా కెసిఆర్ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే కెసిఆర్ ప్రధానమంత్రి కావాలని.. రాష్ట్రంలో కేటీఆర్ సీఎం కావాలని గంగుల కమలాకర్ అన్నారు. కాగా టిఆర్ఎస్ మంత్రి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి . ఇంకొన్ని రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని మంత్రి గంగుల కమలాకర్ చెప్పకనే చెప్పినట్లు పలువురు భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: