ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉందని బీజేపీ పరోక్షంగా ఒప్పుకుంటోంది. ఈ పరిణామాలు జనసేనలో కలవరం పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి పడుతున్న అనుమానం ఇప్పుడిప్పుడే నిజమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకునేందుకు జగన్ ఇష్ట పడడం లేదు. మూడు రాజధానులు, శాసన మండలి రద్దు ఇలా సంచలన నిర్ణయాలతో రాజకీయ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తూ ప్రజలకు షాకులు ఇస్తూ జగన్ ప్రభుత్వం ఏ విషయంలో వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తోంది.

ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు మొదటి నుంచి మౌనంగా ఉండటంతో జగన్ కు వారి మద్దతు ఉందని, అందుకే ఈ విధంగా జగన్ దూసుకెళ్తున్నారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించే జనసేన అధినేత పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, బిజెపి జనసేన కలిసి జగన్ ఇబ్బందులు పెడతాయని అంతా ఒక అంచనాకు వచ్చారు. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి బిజెపి మరింత సైలెంట్ అయిపోయింది.ఈ అంశం తమ పరిధిలోని కాదు అంటూ క్లారిటీగా చెప్పేసింది. అంతే కాకుండా జనసేన బిజెపి ఆధ్వర్యంలో తలపెట్టిన లాంగ్ మార్చ్ ను కూడా సుదీర్ఘంగా వాయిదా వేసింది బీజేపీ.

శాసన మండలి రద్దుపైనా అదే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు. ఏపీ శాసనమండలి రద్దుచేయడం పై కేంద్రం సానుకూలంగానే ఉందని, త్వరలోనే రద్దు ప్రక్రియ పూర్తవుతుంది. అన్నట్టుగా జివిఎల్ కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన శాసన మండలి రద్దు తీర్మానం బిజెపి నేతలు తాజాగా జీవీఎల్ ఓ మీడియాతో మాట్లాడుతూ మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడడం లేదని, రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రక్రియను బిజెపి ప్రభుత్వం ముందుకు తీసుకెళుతున్న అంటూ వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారమే తాము నిర్ణయం తీసుకుంటామన్నారు.

అయితే ప్రస్తుతం బడ్జెట్ కు సంబంధించిన హడావుడి ఉన్న నేపథ్యంలో శాసన మండలి రద్దు బిల్లు కాస్త ఆలస్యం జరగవచ్చని, తాము త్వరగా నిర్ణయం తీసుకున్నా న్యాయశాఖ పరిశీలన, క్యాబినెట్లో చర్చించడం, బిల్లు తయారు చేయడం, దానిని పార్లమెంట్ రాజ్యసభ ఆమోదించిన ఆ తర్వాత రాష్ట్రపతికి చేరడం, ఆయన ఆమోదించడం ఎలా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా 

 

మరింత సమాచారం తెలుసుకోండి: