తాను ఏమి చెప్పినా... చెప్పాలనుకున్నా ఆషామాషీగా చెప్పడు. అన్ని లెక్కలు సరిచూసుకుని పక్కాగా ప్లాన్ ప్రకారమే జగన్ వ్యవహారం చక్కబెడుతూ ఉంటారు. ఇప్పుడు ఏపీలో తీవ్ర గందరగోళానికి కారణమైన రాజధాని వ్యవహారంలోనూ జగన్ అదే ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్టు గా ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. విశాఖను రాజధానిగా చేసేందుకు జగన్ పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. దీనిపై ఎన్ని రకాలుగా విమర్శలు వస్తున్నా జగన్ కు ఎంత మొండి పట్టుదలగానే ముందుకు వెళ్తున్నారు. జగన్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. పరిపాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేసి అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించేందుకు జగన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు.
అయితే ఇక్కడ ప్రధానంగా అందరికీ ఎదురయ్యే ప్రశ్న... అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున మూడు పంటలు పండే భూములను సేకరించి అప్పటి టీడీపీ ప్రభుత్వం విమర్శల పాలైంది. ఇప్పుడు కూడా జగన్ అదే తరహాలో విమర్శలకు గురవుతారని కొంతమంది భావిస్తున్నారు. కానీ జగన్ ఇటువంటి విమర్శలకు ఆస్కారం లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. విశాఖ తో పాటు పరిసర గ్రామాల్లో దాదాపు నాలుగు వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన రాజధానితో పాటు కొన్ని భూములను అమ్మడం ద్వారా సంక్షేమ పథకాలకు కూడా ఈ నిధులను వినియోగించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇప్పటి వరకు అధికారులు సేకరించిన వివరాల ప్రకారం విశాఖ చుట్టుపక్కల గ్రామాల్లో రెండు వేల ఎకరాలను విక్రయానికి వినియోగానికి అనుకూలంగా ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో మూడు వందలకు పైగా వీఎంఆర్డీఏ పరిధిలో 1700 ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విశాఖ గ్రామీణ మండలం లో తొమ్మిది వందల ఎకరాలు, గాజువాక లో 50 , అనకాపల్లిలో వెయ్యి ఎకరాలు,సీతమ్మధారలో 40, ములగాడలో 80 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు.
వీటిని సక్రమంగా ఉపయోగించుకుని ఎటువంటి వివాదాలు లేకుండా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిపాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన ప్రభుత్వం అక్కడ కార్యాలయాలు, సిబ్బంది వసతుల కోసం ఈ భూములను వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ పక్కాగా జగన్ కు అందిన తర్వాత మాత్రమే విశాఖ ను రాజధానిగా ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి