మూడు రాజధానుల విషయం ఏపీలో ఎంత హాట్ టాపిక్ గా నేడిచిందో అందరికీ తెలిసిందే. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకు పడడమే కాకుండా దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే వచ్చారు. అమరావతి తప్ప ఇక ఏ విషయాన్ని తాము ఒప్పుకోమంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ విషయంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై ఆయన మీడియా సమావేశంలో ప్రకటించడంతో అమరావతి జేఏసీ నేతలతో పాటు, ఏపీ ప్రజలంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తాను మద్దతు ఇస్తున్నానని చంద్రబాబు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులలో కర్నూలు హైకోర్టు కూడా ఒకటి కావడంతో చంద్రబాబు మొన్నటి వరకు దీన్ని వ్యతిరేకించారు. అయితే ప్రజల్లో మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయం పై పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుండడంతో పాటు రాయలసీమ , ఉత్తరాంధ్ర జిల్లాల్లో టిడిపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే దానికి చంద్రబాబు అడ్డుగోడగా నిలుస్తున్నారంటూ ఆ ప్రాంత ప్రజల్లో ఒకరకమైన అభిప్రాయం ఏర్పడింది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ఫీడ్ బ్యాక్ రావడంతో మూడు రాజధానుల విషయంలో సైలెంట్ అవ్వాలి అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదీ కాకుండా కేంద్రం ఈ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తూ ఉండటం కూడా ఆయనను ఆలోచనలో పడేసింది.
తాము పోరాటం చేసిన జగన్ పట్టించుకోరని, అదే సమయంలో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుందని, ఇప్పటికీ అదే విషయంపై పోరాటం చేస్తూ వెళితే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాలని ఆలోచన వచ్చారు బాబు. అందుకే మూడు రాజధానుల్లో ఒకటైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. గత టిడిపి ప్రభుత్వంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కొంతమంది ఆ ప్రాంత లాయర్లు చంద్రబాబు ను కలిస్తే జిల్లాకో రాజధాని ఏర్పాటు చేయాలా అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పుడు మాత్రం కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం పార్టీ నేతలే నమ్మలేకపొతున్నారు. ఇప్పటికే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఇకపై ఈ విషయాన్ని తెగేదాక లాగితే ఇబ్బందులుపడతామనే ముందస్తు జాగ్రత్తలో భాగంగా జగన్ తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు మద్దతు పలికినట్టుగా తెలుస్తోంది. దీనిపై చంద్రబాబుకు యూటర్న్ పాలిటిక్స్ అలవాటేగా అంటూ ఆ పార్టీ నాయకులే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసే విషయంలోనూ బాబు ఇదే రకమైన నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పందించేందుకు ఆయన సిద్దమవుతున్నట్టుగా సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి