తెలుగు రాష్ట్రాల్లోని 17 మంది ఎంపిలకు ఎలక్షన్ కమీషన్ పెద్ద షాకే ఇచ్చింది. వెంటనే ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలు చూపించకపోతే  అనర్హత వేటు పడుతుందని తీవ్రంగా చేసిన హెచ్చరికలు సంచలనంగా మారింది.  మామూలుగా ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోగా గెలిచిన ఎంపిలు తమ ఎన్నికల వ్యయాన్ని లెక్కలు గట్టి ఎన్నికల కమీషన్ అబ్వసర్వర్లకు అందచేయాల్సుంటుంది.

 

అయితే ఎన్నికలు జరిగి తొమ్మిది నెలలు అవుతున్నా తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 17 మంది ఎంపిలు తమ లెక్కలను ఇప్పటికీ ఎన్నికల కమీషన్ కు అందచేయాలేదు. దేశం మొత్తం మీద 80 మంది ఎంపిలు లెక్కలు ఇవ్వలేదని నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్ధ తన నివేదికలో బయటపెట్టింది. లెక్కలు ఇవ్వని ఎంపిల్లో 15 మంది ఏపికి సంబంధించిన వాళ్ళుంటే 2 తెలంగాణా ఎంపిలుండటం గమనార్హం.

 

ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం ఎంపిలకు ఇచ్చిన నోటీసుల్లో స్పష్టంగా చెప్పింది. ఎన్నికలు ముగిసిన 90 రోజుల్లో  ఎన్నికల వ్యయాన్ని ఇవ్వాలని తెలిసినా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎంపి పదవులపై వేటు పడే ప్రమాదం ఉందని స్పష్టంగా హెచ్చరించింది. సరే ఎన్నికల ఖర్చులు వెంటనే ఎందుకివ్వరంటే దానికి పెద్ద కతే ఉంది. సగటున ప్రతి ఎంపికి ఎన్నికల ఖర్చు కోట్ల రూపాయల్లో ఉంటుంది. కానీ ఎన్నికల కమీషన్ లెక్కల ప్రకారమైతే చేయాల్సిన ఖర్చు లక్షల్లో మాత్రమే ఉంటుంది.

 

ఎన్నికల కమీషన్  నిబంధన ప్రకారం చేయాల్సిన మొత్తం ఖర్చు  నిజానికి ఎన్నికల ఒక్కరోజు ఖర్చకు కూడా సరిపోదు. అలాంటిది కోట్ల రూపాయల వ్యయాన్ని నిబంధనల ప్రకారం చేయాల్సిన లక్షల వ్యయంలోకి తేవటమంటే మామూలు విషయం కాదు. అందుకనే ప్రతీ అభ్యర్ధి గట్టి లాయర్లను, ఆడిటర్లను దగ్గర పెట్టుకుని లెక్కలతో కుస్తీలు పడుతుంటారు. ఈ విషయం ఎన్నికల కమీషన్ కు కూడా తెలుసు. అయినా నిబంధనలు నిబంధనలే లెక్కలు లెక్కలే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: