జీవితంలో తల్లిదండ్రులను మనం ఎంచుకోలేం. కానీ స్నేహితులను మనం ఎంచుకోవచ్చు. అందుకే నీ స్నేహితులెవరో చెప్పు.. నీవు ఎలాంటి వాడివో చెబుతా అంటారు పెద్దలు. చిన్నవాడే కదా.. లేకుంటే నీ స్థాయి వాడు కాదు కదా అని నీ స్నేహితుల్లో కొందరిని తీసి పారేయొద్దు.

 

వారిలో ఎవరు నీ మేలు కోరి నీతో స్నేహం చేస్తున్నారో తెలుసుకో ముందు. దాని ప్రాతిపదికగానే వారికి నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే.. మహారాణా ప్రతాప్‌ ‘భిల్లులు’ అనే ఆటవికులను వెంటబెట్టుకొని అక్బరుపై ఇరవై అయిదు సంవత్సరాలు యుద్ధం చేశాడు. అజరామర ఖ్యాతిని పొందాడు.

 

అంతెందుకు.. ఛత్రపతి శివాజీ ‘కోలీలు’ అనే కొండజాతివారి సహాయం తీసుకొని జైత్రయాత్ర సాగించాడు. అల్లూరి సీతారామరాజు కూడా.. కోయలను వెంటపెట్టుకొని రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను గడగడలాడించగలిగాడు. అందుకే నీ స్నేహితుల్లో స్థాయిని చూడకు. వారి చిత్త శుద్ధిని, నీపై ఉన్న అనురాగాన్ని అంచనా వేయి. వారే నీ మంచి స్నేహితులు. ఆల్ ద బెస్ట్..

మరింత సమాచారం తెలుసుకోండి: