ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి రాజధాని తరలింపు పై ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి ప్రాంత రైతులు అందరూ ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే. అమరావతి నిర్మాణం కోసం తాము భూములు త్యాగం చేశామని అలాంటిది ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు అందరూ నిరసనలు ధర్నాలు చేపడుతున్నారు.అయితే ఇప్పటికే అమరావతి ప్రాంత రైతులు నిరసనలు 60 రోజులకు చేరుకున్నాయి కూడా. అమరావతి ప్రాంత రైతుల నిరసనలకు అటు విపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 

 


 విపక్ష  పార్టీలైన టీడీపీ జనసేన పార్టీ లు అమరావతి రైతుల ఉద్యమానికి  మద్దతు తెలుపుతూ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించి అమరావతి రైతుల నిరసన లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై పలు విమర్శలు గుప్పించడం తోపాటు అమరావతి ప్రాంత రైతులకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి సర్కార్ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 

 

 రాజధాని ప్రాంత గ్రామంలోని రైతులు మహిళలు ను కలుసు  కుంటూ వారి సమస్యలు వింటూ ముందుకు తాగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మందడం  లో నిరసన తెలుపుతున్న రైతులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో నమాజ్ వినిపించింది.  దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని నిలిపివేశారు. నమాజ్ పూర్తయినంతవరకు మౌనం పాటించారు పవన్ కళ్యాణ్. నమాజ్ పూర్తి అయిన తర్వాత మళ్లీ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఈ ప్రాంత రైతులు చేపడుతున్న ఉద్యమానికి దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనటానికి  నమాజ్ ఒక బలమైన ఉదాహరణ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: