టెక్నాలజీ మారుతున్న కొద్దీ... ప్రజల ఆలోచనా తీరులో కూడా మార్పు వస్తోంది. ఎక్కడికో వెళ్లి మనకు కావాల్సింది తెచ్చుకోవడం ఎందుకు అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోని యాప్లతో అని మన చంతకు వచ్చేలా చేసుకోవడం మేలు అని అనుకుంటున్నారు నేటితరం జనాలు. ఈ క్రమంలోనే ఏం కావాలన్నా ఆన్లైన్ ద్వారానే ఆర్దర్  చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా వస్తువు కొనాలన్నా కూడా ఆన్లైన్ ఆర్డర్ పైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే అందరికీ ప్రత్యేక సేవలు అందించేందుకు ఎన్నో సరికొత్త యాప్స్  అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చింది ఓఎల్ఎక్స్. ఓఎల్ఎక్స్ లో ఏ పాత వస్తువు నైనా అమ్మకానికి పెట్టవచ్చు కదా... ఏదైనా సెకండ్ హ్యాండ్ కొనాలనుకుంటే ఓఎల్ఎక్స్ లో కొనుగోలు చేయడానికి వీలు ఉంటుంది.

 

 

 ఈ నేపథ్యంలోనే చాలామంది ఓఎల్ఎక్స్ ద్వారా పలు వస్తువులను కొనడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అంతేకాకుండా ఓఎల్ఎక్స్ లో అన్ని రకాల వస్తువులు అమ్మకానికి పెట్టడంతో పాటు కొనుగోలు చేయడానికి కూడా వీలు ఉంటుంది. దీంతో చాలామంది తాము కొన్ని రోజులపాటు ఉపయోగించి ఆ తర్వాత అమ్మాలనుకున్న వస్తువును  ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెడతారు. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనాలి అనుకునేవారు కూడా ఓఎల్ఎక్స్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ... ఓఎల్ఎక్స్ లో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. 

 

 

 ముఖ్యంగా నగరంలో ప్రజలను టార్గెట్గా చేసుకుని ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓఎల్ఎక్స్ ద్వారా సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనాలనుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో ఓఎల్ఎక్స్ లో కూడా నెటిజన్లకు సైబర్ నేరగాళ్ల నుంచి తిప్పలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది నగరంలోని 3 కమిషనరేట్లలో  ఓఎల్ఎక్స్ లో ఆన్లైన్ మోసాలకు సంబంధించి 3838 ఆన్లైన్ మోసాలకు సంబంధించి కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 13.35 ఐదు కోట్ల రూపాయలను మోసాలు  చేసినట్లు పోలీసులు తెలిపారు  ఆన్లైన్ వెబ్సైట్లు పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: