ఓట్ల కోసం చంద్రబాబునాయుడు ఎటువంటి రాజకీయం చేయటానికైనా రెడీ అవుతారన్న విషయం అందరికీ తెలిసిందే.  తాజాగా విజయవాడలో జరిగిన పరిణామాలు దాన్నే సూచిస్తోంది. తాజాగా రెండు పార్టీల నేతలు కలిసి ఓ బహిరంగసభలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేంద్రప్రభుత్వం అమలు చేయాలని అనుకుంటున్న ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్ఫీఆర్ బిల్లులకు వ్యతిరేకంగా రెండు పార్టీలు కలవటమే విచిత్రంగా ఉంది. గతంలో కామన్ పాయింట్ గా ఎంత అవసరమైనా రెండు పార్టీలు ఏ దశలో కూడా కలిసి పనిచేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంఐఎం అన్నది కేవలం హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పార్టీ.  ఉమ్మడి రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ వ్యవహారాలపై చంద్రబాబునాయుడు చాలా కఠినంగా వ్యవహరించారు. దాంతో ఆ పార్టీ నేతలు చంద్రబాబును పూర్తిగా వ్యతిరేకించేవారు. అందుకనే కాంగ్రెస్ తో చేతులు కలిపారు. సరే వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఎంఐఎం ప్రయోజనాలే లక్ష్యంగా కేసియార్ తో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి మిత్రపక్షంగా ఉన్నారు.

 

నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన ఎన్ఆర్సి తదితర చట్టాలపై దేశవ్యాప్తంగా ముస్లింలు మండిపోతున్నారు. ఇందులో భాగంగానే చట్టాలను ఎంఐఎం కూడా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి  తెలుగుదేశంపార్టీ కూడా వ్యతిరేకంగానే ఉన్నట్లే లెక్క. ఎందుకంటే చంద్రబాబు కమలంపార్టీకి దగ్గరవుదామని ఎంత ప్రయత్నిస్తున్నా మోడి దగ్గరకు రానీయటం లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో చేతులు కలుపుతారా అనే అనుమానాలు మొదలయ్యాయి.

 

సరే ఎలాగూ సందర్భం కలిసి వచ్చింది కాబట్టి రెండు పార్టీలు చేతులు కలిపినట్లే అనుమానంగా ఉంది. విజయవాడలో జరిగిన బహిరంగసభలో అసదుద్దీన్, విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని చేతులు కలిపారు. ఇద్దరూ ఒకే వేదిక మీద కలిశారు. చూడబోతే ఈ అవకాశాన్ని అడ్డం పెట్టుకుని టిడిపి మళ్ళీ ముస్లింలకు దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లుంది.  చంద్రబాబు అనుమతి లేకుండా నాని ఎంఐఎంతో చేతులు కలిపే అవకాశమే లేదు.  గడచిన రెండు ఎన్నికల్లో టిడిపి తరపున ఒక్కరంటే ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. అందుకనే ఎంఐఎంతో చేతులు కలిపారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: