యూరప్ ఖండంలోని స్కాట్లాండ్ దేశానికి చెందిన 57 ఏళ్ల జేమ్స్ స్కాట్ అనే ఒక వ్యక్తి అద్దాలు తయారు చేసే పరిశ్రమలో పని చేసేవాడు. అయితే ఒకరోజు జేమ్స్ తన డ్యూటీ కి వెళ్ళి పనిచేస్తుండగా ఒకటిన్నర టన్నుల అద్దం అతని ఉదర భాగం పై పడింది. ఈ ప్రమాదంలో అతని వెన్నుముక విరిగింది, అలాగే మొల భాగంలో తీవ్రమైన నాలుగు గాయాలయ్యాయి. దిగువ వెన్నుముక ఛిద్రమవ్వడంతో పాటు రెండు కాళ్ల తొడలలో ఘోరమైన బొక్క పడి అతని పరిస్థితి భయంకరంగా మారిపోయింది. దీంతో వైద్యులు అతడికి 4 ఆపరేషన్లు చేసి ప్రాణాలను కాపాడారు. అలాగే ఈ ప్రమాదంలో అతడి మూత్రనాళం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో మూత్రము పోసుకోవడానికి వైద్యులు ప్రత్యామ్నాయంగా ఒక ఏర్పాటు చేశారు. కానీ ఆపరేషన్లు అన్ని అయిపోయిన తర్వాత అతనికి అంగస్తంభన లోపం వచ్చింది. ఈ లోపంతో అసంతృప్తి చెందిన జేమ్స్, ఇంకొక ఆపరేషన్ చేయించుకుందామని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆసుపత్రిలో పురుషాంగ ఆపరేషన్ చేయించుకున్నాడు. కానీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత అతనికి 24 గంటల పాటు అంగస్తంభన జరుగుతూనే ఉంది. దీంతో ఏం చేయాలో తోచక తల పట్టుకుంటున్నాడు జేమ్స్. ప్రస్తుతం అతడు బట్టలు ధరించే పరిస్థితిలో కూడా లేడంట.



ఈ విషయంపై తను మాట్లాడుతూ... 'నాకు తొమ్మిదేళ్ల బిడ్డ ఉంది. కానీ ఈ ఆపరేషన్ వలన నేను తనని చూడకుండా ఒక గదిలో నేరస్తుడి లాగా తాళం వేసుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే అంగస్తంభన 24 గంటల పాటు అవుతుండడంతో నా మొల భాగంలో నొప్పి పుడుతుంది. వైద్యులను రమ్మంటే ఎవరూ రాకుండా వాళ్లు సెలవుల్లో ఉన్నామని చెపుతున్నారు', అని ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పుకొస్తున్నాడు.



ఇలాంటి పొరపాటు గతంలో కూడా ఒక వ్యక్తి చేసి ప్రపంచ వార్తలలో నిలిచాడు. వివరాలు తెలుసుకుంటే... కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి దున్నపోతుల కోసమే వాడే లైంగిక ఉద్దీపన మాత్రలను వేసుకున్నాడు. దీంతో అతనికి రోజుల తరబడి అంగస్తంభన జరుగుతుండడంతో గత్యంతరం లేక ఆస్పత్రికి వెళ్ళాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆపరేషన్ చేసి మరీ అతని ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. దున్నపోతులకి వాడే మాత్రలు మీరు ఎందుకు వాడారు అయ్యా అని చికిత్స అందించే ముందు డాక్టర్లు ప్రశ్నిస్తే... '30 ఏళ్ల మహిళతో ఏకాంత సమయం గడపడానికి వేసుకున్నాను, డాక్టర్', అంటూ అతడు చెప్పుకొచ్చాడు. ఏదేమైనా మగవారు తమ సున్నిత భాగం పై ప్రయోగాలు చేయకూడదని ఈ రెండు సంఘటనల గురించి తెలుసుకుంటే స్పష్టమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: