చంద్రబాబునాయుడు కుటుంబం  గడచిన తొమ్మిదేళ్ళుగా  ఆస్తులు, అప్పుల ప్రకటన చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో గురువారం ఆస్తులు, అప్పులపై నారా లోకేష్  చేసిన ప్రకటనలో డొల్లతనం బయటపడిందా ? సాక్షి మీడియా చెప్పిన వివరాల ప్రకారం లోకేష్ చేసిన ప్రకటనంతా బోగస్సే. నిజానికి ఒకపుడు చంద్రబాబు, ఇపుడు లోకేష్ చేస్తున్న ఈ ప్రకటనలను జనాలెవరూ నమ్మటం లేదు. పైగా వాళ్ళ ఆస్తులు, అప్పులతో మామూలు జనాలకు ఎటువంటి సంబంధం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

చంద్రబాబు కుటుంబానికున్న ఆర్ధిక నేపధ్యం తెలిసిన వాళ్ళెవరూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  నిప్పులాంటి వాడంటే ఏమాత్రం నమ్మరు. తొమ్మిదేళ్ళుగా కుటుంబం ప్రకటిస్తున్న వివరాలు పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఇంతకీ ప్రస్తుత విషయానికి వస్తే తాజాగా లోకేష్ చేసిన ప్రకటనలో తన కొడుకు దేవాన్ష్ పేరుమీద 26, 440 హెరిటేజ్ షేర్లను బదిలిచేశారు. తాతయ్య, నానమ్మల నుండి మనవడికి షేర్లు బదిలీ అయినట్లు లోకేష్ చూపించారు.

 

ఇక్కడ విషయం ఏమిటంటే పోయిన ఏడాది తల్లి భువనేశ్వరి ఖాతాలో ఉన్న షేర్లను తాజా ప్రకటనలోని షేర్లతో పోలిస్తే ఎక్కడా బదిలీ చేసినట్లు కనబడలేదు. అంటే బదిలీ అయిన షేర్లన్నీ తాత అయిన చంద్రబాబు ఖాతా నుండే బదిలీ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అన్నింటికన్నా విచిత్రమేమిటంటే  గడచిన తొమ్మిదేళ్ళుగా చంద్రబాబు పేరుతో  హెరిటేజ్ షేర్లున్నట్లు ఎప్పుడూ చూపించలేదు. అంటే చంద్రబాబు పేరుతో అసలు షేర్లే లేవని అర్ధం అవుతోంది.

 

కానీ 2018-19 ఆర్ధిక సంవత్సరంలో మాత్రం చంద్రబాబు నుండి మనవడికి 26,440 షేర్లు బదిలి చేసినట్లు చూపించారు. అంటే చంద్రబాబు పేరుతో లేని షేర్లను మనవడి పేరుతో ఎలా బదిలీ అయ్యింది ? ఇక్కడే లోకేష్ ప్రకటించిన వివరాలన్నీ బోగస్ అంటూ సాక్షి మీడియా ఏకిపారేసింది. నిజానికి తాము ప్రకటిస్తున్న వివరాల్లో నిజమెంతో చంద్రబాబు కుటుంబానికి కూడా తెలుసు.  తాము చూపిస్తున్న లెక్కలను ఎవరూ నమ్మరని తెలిసినా ప్రతి ఏటా చూపించటమంటే ....

మరింత సమాచారం తెలుసుకోండి: