అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భార‌త ప‌ర్య‌ట‌న గుజ‌రాత్ నుంచి ప్రారంభ‌మైంది. ముందుగా త‌న భార్య మెల‌నియాతో పాటు అమెరికాకు చెందిన ఉన్న‌తాధికారుల నుంచి భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ట్రంప్ అహ్మ‌దాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్క‌డ ప్ర‌ధాన‌మంత్రి మోడీ ట్రంప్ దంప‌తుల‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఇక స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం చేరుకున్న ట్రంప్ దంప‌తులు అక్క‌డ నుంచి నేరుగా మొతేరాలోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ స్టేడియంకు చేరుకున్నారు.



అక్క‌డ నుంచి న‌మ‌స్తే ట్రంప్ కార్య‌క్ర‌మం త‌ర్వాత నేరుగా అగ్రాకు బ‌య‌లు దేరారు. ఇక ట్రంప్ ప్రోగ్రామ్‌లో ఆయ‌న కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఆమె గ‌తంలో కూడా ఓ సారి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ట్రంప్ త‌న ప్ర‌సంగంలో ఈ విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇవాంకా ట్రంప్ ఆమె భ‌ర్త‌ జరెడ్‌ కుష్‌నర్‌లు కూడా భారత్ కు విచ్చేశారు.



ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్‌ డ్రెస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న మిడి డ్రెస్‌ను ఆమె ధరించారు. బౌవుడ్‌ నెక్‌లైన్‌తో, పఫ్పుడ్‌ స్లీవ్స్‌తో డ్రెస్‌ చాలా అందంగా ఉంది. ఆమె ఎత్తుకు డ్రెస్‌ కు మ్యాచ్‌ అయ్యేలా ఎర్రటి హైహీల్స్‌ కూడా ధరించారు. ఆమె 2019లో అర్జెంటైనాకు వెళ్లిన‌ప్పుడు సైతం ఇదే డ్రెస్ ధ‌రించారు. ఇక ఈ డ్రెస్ ఖ‌రీదు రూ .1,71,331 (USD 2,385). ఇదిలావుంటే ఇవాంకా 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టారు.



అక్క‌డ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె జ‌రెడ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇవాంకా వారాంతాల్లో, సెలవుల్లో టామీ హిల్‌ఫిగర్, ససాన్‌ జీన్స్‌ బ్రాండ్లకు మోడల్‌గా ఆమె పనిచేశారు. 1997లో సెవంటీన్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీపై కనిపించి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: