‘అబద్ధం చెప్పే వాళ్ళనీ గొప్పలు చెప్పుకునే వాళ్ళనీ తాగుబోతులను తిరుగుబోతులను నేరస్తులను ఇలా ఎవరినైనా భరించవచ్చు కాని కృతజ్ఞతా భావం లేని వాళ్ళని భరించడం చాల కష్టం’ అంటూ ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత విలియమ్ షేక్స్ పియర్ అనేక సార్లు తన రచననలలో ప్రస్తావించాడు. కృతజ్ఞత లేకుంటే సంపద రాదు ఎవరికైనా అదృష్టం కలిసి వచ్చి సంపదను ఆర్జించవచ్చు.


అయితే ఆ సంపద ఎవరివల్ల వచ్చిందో అన్న విషయమై కృతజ్ఞత లేకుండా ప్రవర్తించే వారు దగ్గర డబ్బు శాస్వితంగా ఉండదు అని అంటారు. అందుకే నిద్రపోయే ముందు అదేవిధంగా నిద్ర లేచిన తరువాత మనకు సంపద సంపాదించడంలో సహకరించిన వ్యక్తులకు మనసులో కృతజ్ఞతలు తెలియ చేసుకోకపోతే ఆ సంపద ఎట్టి పరిస్థితులలోను నిలవదు అని ఆధ్యాత్మిక వాదులు చెపుతూ ఉంటారు. 


ప్రతిరోజు లేమిని తలుచుకుంటూ కాలం గడుపుతూ ఉంటే పేదరికం వెంటాడుతుందనీ అదే ఇప్పటికే మన దగ్గర ఉన్న వాటికి ఆనంద పడుతూ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉంటే మనలో సంపన్న భావాలు పెరిగి భవిష్యత్ లో ఐశ్వర్య వంతులుగా అవుతారని చెపుతూ ఉంటారు. అందుకే మనస్తత్వ శాస్త్రంలో మనం మనసులో నిలుపుకోగలిగిన కోరికలు మాత్రమే వాస్తవ రూపంలో నిజాలుగా మారి మనకు ఐశ్వర్యం కలిగిస్తాయి అని అంటారు. 


అందుకే మన కోర్కెలను లక్ష్యాలుగా మార్చుకుని ప్రతిరోజు మన కోర్కెలను ఒక చీటీ పై వ్రాసుకుని ప్రతిరోజు చూసుకుంటూ ఉంటే ఆ కోర్కెలు మనకు తెలియకుండానే మన జీవితంలో లక్ష్యాలుగా మారిపోతాయి. కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనలో దాతృత్వం అదేవిధంగా ఆశావాదం పెరిగి తద్వారా అచంచలమైన ఆత్మ విశ్వాసం మనలో పెరుగుతుంది. అందుకే మనకు ఉద్యోగాన్ని ఇచ్చిన వ్యక్తి గురించి అదేవిధంగా మనం చేస్తున్న వ్యాపారానికి సహకరించిన వ్యక్తుల గురించి నిరంతరం కృతజ్ఞులై ఉన్నవారు మాత్రమే విజయాలను అందుకుని ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఐశ్వర్య వంతులు కాగలుగుతారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: