ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో విపక్ష పార్టీలు ఎన్ని ఇబ్బందులు సృష్టించిన మొండిగా ముందుకు వెళ్తున్నారు. కేవలం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాదు అంతకు ముందు ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయే విషయంలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండిగానే వ్యవహరించారు. పాదయాత్ర కు కాంగ్రెస్ పార్టీ అనుమతించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుని  ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఇక ఆ తర్వాత పాదయాత్ర చేస్తున్న సమయంలో... అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి పార్టీ జగన్ ను అక్రమాస్తుల కేసులో జైల్లో పెట్టినప్పటికీ పాదయాత్ర అసలు ఆగకూడదు అనే ఉద్దేశంతో... జగన్ సోదరి షర్మిల తల్లి విజయమ్మ ల తో పాదయాత్రను కంటిన్యూ చేశారు.

 

 

 ప్రతిపక్షాలు కూడా జగన్ మొండి వైఖరికి కాస్త భయపడుతున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్ చేయాలి అనుకున్నది చేస్తూనే వెళ్లారు. ఒకవేళ ఆయన చేయాలనుకున్న దానిలో చిన్న చిన్న మార్పులు చేశారు కానీ ఏ విషయంలో వెనుకడుగు మాత్రం వేయలేదు. ఇప్పుడు  వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలు అన్నింటిని... ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పటికీ మొండిపట్టు తోనే ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోని 3 రాజధాని లకు సంబంధించి కార్యాచరణను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇంకా ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు అన్నది ప్రస్తుతం అందరిలో నెలకొన్న ప్రశ్న.

 


 అయితే ఆయన జాతకం ప్రకారం ఏప్రిల్ నెలలో జగన్ ఇష్టానుసారంగా పాలన సాగిస్తే కలిసివస్తుందని ఆయన ఎంతగానో నమ్మి సాదువు చెప్పారట. అయితే ఒకప్పుడు జగన్ కు ఇలాంటి నమ్మకాలు కానీ పట్టింపులు కానీ ఏమీ ఉండేది కాదు కానీ గత 2019 ఎన్నికలు... నుంచి  ఇలాంటి నమ్మకాలను పెట్టుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏప్రిల్ నెల ముందు  వరకు జగన్ కు జాతకం ప్రకారం గండాలు ఉన్నాయని ఏప్రిల్ నెలలో జగన్ గండాలన్నీ తొలగిపోతాయని అప్పటి నుంచి తనదైన పాలనను కొనసాగించాలి అంటూ జగన్ నమ్మే  సాధువు చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజుల వరకు వేచి చూసినట్లు చెబుతున్నారు రాజకీయవిశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: