మొన్నటి ఎన్నికల్లో దాదాపు నేలమట్టమైపోయిన తెలుగుదేశంపార్టీకి అధికార వైసిపినే ఊపిరి ఊదుతోంది. దాంతో చంద్రబాబునాయుడు మళ్ళీ గొంతు సవరించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన ఒక ఎత్తైతే ఇపుడు విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవటం వైసిపి చేసిన అతిపెద్ద తప్పు. వైసిపి తప్పుల మీద తప్పులు చేస్తు చంద్రబాబును తానే హీరోను చేస్తోంది మళ్ళీ.

 

నిజానికి చంద్రబాబు అతిపెద్ద బలమంటే మీడియా మద్దతే అన్న విషయం అందరికీ తెలిసిందే.  మొన్నటి ఎన్నికల్లో జగన్ చేతిలో చంద్రబాబు చావుదెబ్బతిన్నాడనే చెప్పాలి. మామూలుగా అయితే అంత దెబ్బ తిన్న తర్వాత ఏ ప్రతిపక్షానికైనా పుంజుకునేందుకు చాలా కాలం పడుతుంది. కానీ చంద్రబాబు మాత్రం నెలంటే నెల రోజులకే ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడటం మొదలుపెట్టారు. జగన్ పరిపాలనపై వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతున్నారు.

 

ఏదో కారణంతో ప్రతిరోజు జనాల్లో తిరగటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ  నేపధ్యంలోనే మూడు రాజధానులకు వ్యతిరేకంగా కొంత కాలం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తిరిగారు. ఇపుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో మళ్ళీ మరో డ్రామాకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఇదే టూర్ కోస ఉత్తరాంధ్రలో అడుగుపెట్టారు. మామూలుగా అయితే చంద్రబాబు  విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పర్యటనకు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఎప్పుడైతే చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని స్వయంగా మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ పిలుపిచ్చారో అప్పుడు చంద్రబాబు పర్యనటకు ప్రాధాన్యత పెరిగిపోయింది. జనాలు అడ్డుకుంటే చంద్రబాబు జీరో అవుతాడు. అదే వైసిపి అడ్డుకోవటంతో హీరో అయిపోయాడు.

 

అసలు ఆందోళనలు చేయాలని మంత్రులు పిలుపివ్వటమేంటో అర్ధం కావటం లేదు.  చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటం ద్వారా ప్రభుత్వమే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని హీరోని చేసేసింది. చంద్రబాబు పర్యటనకు లేని ప్రాధాన్యతను తెచ్చిపెట్టినట్లైంది వైసిపి చేసిన ఆందోళన. ఇటువంటి తప్పులకు  జగన్ గనుక అడ్డుకట్ట వేయకపోతే ముందు ముందు వైసిపి మూల్యం చెల్లించుకోక తప్పదనే అనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: