కరోనా  వైరస్ ప్రస్తుతం భారత దేశాన్ని కూడా వనికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ లో ప్రవేశించిన కరోనా శరవేగంగా ఇతరులకు కూడా వ్యాప్తి చెందుతుంది. దీంతో రోజురోజుకు భారత్లో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా  వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి . అయితే తెలంగాణలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ పై  సినీ రాజకీయ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా వివిధ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ జనసేన నేత సినీ నటుడు నాగబాబు కరోనా వైరస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మనుషుల ప్రాణాలు పోతే ప్రకృతి జంతువులు సంతోషం గా ఉంటాయి అంటూ సంచలన వ్యాఖ్యలు మెగా బ్రదర్ నాగబాబు. 

 

 ఇక తాజాగా మరోసారి తెలంగాణలో శర వేగంగా వ్యాప్తి తెలుగు రాష్ట్రాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ కు సంబంధించి మెగా బ్రదర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన దైవ భక్తులందరికీ ఓ సవాల్ విసిరారు. దేవుడు గొప్ప లేదా కరోనా వైరస్ గొప్ప అని ప్రజలకు పరీక్ష పెట్టారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే తనను తాను నాస్తికుడిగా ప్రకటించిన నాగబాబు సందర్భం వచ్చినప్పుడల్లా.. దేవుడికి సంబంధించిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా మరోసారి వివాదాస్పద పోస్ట్ పెట్టారు నాగబాబు... దేవుడి భక్తులందరికీ నా చాలెంజ్... ఎక్కువగా ప్రజలు గ్రూప్ గా ఉండవద్దు  అంటూ ప్రభుత్వం సూచిస్తుంది. ఈ సమయంలో మీకు దేవుడిపై నమ్మకం ఉంటే ప్రార్థనాలయాలకు  గ్రూప్ గా వెళ్లి పూజలు ప్రార్థనలు ప్రేయర్ చేయండి. 

 

అక్కడి ప్రసాదాలు తీర్థాలు స్వీకరించండి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు సేఫ్ గా ఉంటే మీరు అన్నట్లు దేవుడు గొప్ప... కానీ ఎక్కడైనా తేడా కొడితే మాత్రం కరోనా వైరస్ దేవుడు కంటే గొప్ప అంటూ నాగబాబు ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం నాగబాబు పెట్టిన పోస్ట్ క్లాస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక దీనిపై నెటిజన్లు కూడా కాస్త భిన్నంగా ని స్పందిస్తున్నారు. ఇక అంతకు ముందుగా నాగబాబు మనిషి అనే జీవి పూర్తిగా చనిపోతేనే ఈ భూమ్మీద ప్రకృతి వాతావరణం అద్భుతంగా ఉంటాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: