భారతదేశ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ దేశంలో జరుగుతున్న ప్రముఖ సంఘటన గురించి, సమస్యల గురించి తన శాండ్ ఆర్ట్ రూపంలో చూపించి మంచి సందేశాన్ని, అవగాహనని ప్రజల్లో కలిపిస్తుంటాడు. ఇప్పటికే 3000 మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి 90 వేల మందికి సోకగా... దీని గురించి సుదర్శన్ ఒక ఇసుక శిల్పం చెక్కి అవేర్ నెస్ ని తెస్తున్నాడు. ఐతే పై చిత్రంలో కనిపిస్తున్న కరోనా వైరస్ 'శాండ్ ఆర్ట్' ఒడిశా రాష్ట్రంలోని పూరి బీచ్ లో చెక్కబడింది. కరోనా వైరస్ గురించి చెక్కబడిన ఈ శాండ్ ఆర్టు లో వైరస్ సోకకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, భయపడవద్దని సుదర్శన్ చెప్పాడు. అలానే ఈ ఆర్ట్ లో ఒక అమ్మాయి తన మూతికి ఒక ముసుకు ను ధరించి సబ్బుతో తన చేతులను ఒక కుళాయి కింద కడుక్కుంటుంది.

 

 

సుదర్శన్ పట్నాయక్ తన శాండ్ ఆర్ట్ ని ఫోటో తీసి అది సోషల్ మీడియా లో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఫిబ్రవరి నెలలో కూడా కోవిద్ 19 జబ్బు చైనా దేశంలో శరవేగంగా దూసుకెళ్తుంటే సుదర్శన్ కరోనా వైరస్ పై ఒక శాండ్ ఆర్ట్ చెక్కి దాని గురించి అవగాహన కల్పించాడు. ఇకపోతే నిన్న అనగా మార్చ్ 4న ఆధునిక అభివృద్ధి చెందిన ఒడిశా (పరిశ్రమలు, విమానాలతో సహా) తో బిజు బాబు యొక్క చిత్రాన్ని సృష్టించిన ఈ కళాకారుడు “బిజు పట్నాయక్ భారత్ రత్నకు అర్హుడు” అనే సందేశాన్ని కూడా పంచుకున్నాడు.

 

 

ఏదేమైనా సుదర్శన్ పట్నాయక్ ఇసుక శిల్పాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఏది ఏమైనా ఇతడిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది కళాకారులు ఇసుక ని శిల్పాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ సుదర్శన్ పట్నాయక్ ఇసుక శిల్పం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: