ప్రస్తుతం ప్రపంచ దేశ ప్రజలందరిని  ప్రాణ భయంతో గడగడా వణుకిస్తూ  విలయ తాండవం చేస్తుంది ప్రాణాంతకమైన కరోనా వైరస్.ఈ  వైరస్ కి ఇప్పటివరకు సరైన వ్యాక్సిన్  కూడా లేకపోవడంతో వైరస్ సోకితే ప్రాణాలు పోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ ఈ వైరస్కు వ్యాక్సిన్ కనుక్కునే పనిలో నిమగ్నం అయినప్పటికీ ఎక్కడ ఫలితాలు మాత్రం రాలేదు. ఈ వైరస్ సోకి ఎక్కడ  ప్రాణాలు పోతాయో అని  అందరూ ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ 57 దేశాలకు వ్యాప్తి చెందింది. మొన్నటివరకు చైనా దేశంలో ఈ ప్రాణాంతకమైన వైరస్ మరణమృదంగం మోగిస్తూ 3,200 మంది ప్రాణాలను బలి తీసుకోగా ఇప్పుడిప్పుడే చైనా దేశంలో ఈ వైరస్ తగ్గు ముఖం పడుతుంది. కానీ మిగతా దేశాలలో అయితే ఈ వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతోంది. 

 

 

 అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ వైరస్ సోకిన వాళ్ళు ఇతర దేశాల నుంచి వస్తున్న కారణంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలోనే భారతదేశంలోకి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 31 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్  మన దేశంలో  తొందరగానే తగ్గే అవకాశం ఉందని ఎందుకంటే ప్రస్తుతం వేసవి నేపథ్యంలో ఎండలు మండిపోతున్న తరుణంలో వేడిని  తట్టుకోలేదు అంటూ  నిపుణులు సూచిస్తున్నారు. తక్కువగా వేడిగా ఉంటే ఈ వైరస్ ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వేసవి నేపథ్యంలో ఎండలు దండిగా కొడితే వైరస్ ప్రభావం తక్కువ ఉంటుందని  అంటున్నారూ.  ఇప్పుడు ఒకవేళ వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడితే మాత్రం వైరస్ ని కంట్రోల్ చేయాలి అని చెబుతున్నారు. 

 

 

 అయితే రెండు రోజుల నుండి పలు ప్రాంతాలు వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లడక్ ఢిల్లీ వెస్ట్ బెంగాల్ పంజాబ్ హర్యానా ప్రాంతాల్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంటున్నాయి. పలుచోట్ల స్వల్పంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కాస్త వర్ష ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ పై మరింత అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగుతున్నారు అధికారులు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: