తమ రాజకీయ ప్రత్యర్ధులు తనను విమర్శించే అవకాశం ఇవ్వకుండానే, వారి పై ఎదురుదాడి చేయడంలో టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా తమ రాజకీయ ప్రత్యర్ధుల విషయంలో కేసీఆర్ వైఖరి ఒకేలా ఉంటూ వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే టిఆర్ఎస్ వ్యతిరేక శక్తులపై కెసిఆర్ పంచ్ డైలాగులు వేస్తూ.. వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారో ఆ విధంగానే ఇప్పుడు తన రాజకీయ శత్రువులైన కాంగ్రెస్, బిజెపి పార్టీలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఈ రెండు పార్టీల నేతలు కొద్ది రోజులుగా చేస్తున్న ఆరోపణలపై స్పందించారు కేసీఆర్.

 

IHG


టిఆర్ఎస్ నాయకులు ఎన్నో కేసులు పెట్టి తెలంగాణను అడ్డుకోవాలని చూశారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ బీజేపీ కుట్రలు ఆగలేదని, తాము అధికారంలో ఉండడంతో తమను విమర్శించేందుకు ఎంత నీచానికైనా కాంగ్రెస్ పార్టీ దిగజారుతోందని కేసీఆర్ మండిపడ్డారు. అలాగే ఏడు మండలాలతో పాటు, సీలేరు ప్రాజెక్టు దక్కకుండా బిజెపి అడ్డు పడుతోందని, అభివృద్ధికి సహకరించాల్సింది పోయి రాజకీయం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. మొన్నీ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు అధికారికంగా ఒప్పందం చేసుకున్నారని కేసీఆర్ విమర్శలు చేశారు. 


స్వతంత్రం వచ్చాక అనేక రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. అలాగే ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను ఉద్దేశించి కెసిఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి తమ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ పదే పదే భట్టి విక్రమార్క విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో ఎవరు డబ్బులు పెట్టి గెలిచారో అందరికీ తెలుసు అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: