అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా మహిళలు రాణిస్తున్నారు. అసలు మగవాళ్ల కంటే ఆడవారే కూడా యాక్టివ్‌ గా ఉంటున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌ టాక్‌ లలో సైతం తమ నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో సహా సామాన్యులు కూడా స్టార్‌ లుగా వెలిగిపోతున్నారు.

 

 

యూ ట్యూబ్ టాప్ ఫాలోవర్స్ లో ఉత్తరప్రదేశ్ కి చెందిన నిషామధులిక ఉంది. ఆమె ఫాలోవర్స్‌.. 7 కోట్ల 65 లక్షల మంది (7.65 మిలియన్‌)మా కె హాత్‌ కా ఖానా (అమ్మ చేతి వంట) అనే చానెల్‌ ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్ కు షెఫ్‌ నిషా మధులిక. చిన్నప్పుడు తన తల్లి దగ్గర నేర్చుకున్న ఉల్లి, వెల్లుల్లి లేని శాకాహార వంటకాలను ఓ వెబ్‌ సైట్‌ కు రాసేవారట. దీంతో మంచి స్పందన రావడంతో భర్త, కొడుకు సహాయంతో తనే సొంతంగా http://nishamadhuli ka.com/ అనే వెబ్‌ సైట్‌ పెట్టారు.

 

ఆ వెబ్ సైట్ కి విశేష స్పందన రావడంతో 2016లో యూ ట్యూబ్‌ లో వంటల చానెల్‌ స్టార్ట్‌ చేశారు. ఆమె వంట చేస్తూ ఆ రెసిపీ గురించి చెప్తుంటే ఆమె భర్త ఆ వంటకాన్ని వీడియో తీస్తారు. తదుపరి చానెల్‌ లో అప్‌ లోడ్‌ చేస్తారు. ఇప్పటి వరకు ఉల్లి, వెల్లుల్లి కూడా లేని దాదాపు పన్నెండు వందల శాకాహార వంటకాలను తన యూట్యూబ్‌ వంటల చానెల్‌లో అప్‌లోడ్‌ చేశారు నిషా మధులిక. యూత్, కొత్తగా పెళ్లయిన జంటలు, వర్కింగ్‌ ఉమెన్ చానెల్‌ ను సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.

 

 

 

 ట్విట్టర్ లో దీపికా పదుకునే కు 1 కోటి 39 లక్షల మంది (13. 9 మిలియన్‌) ఆమె ఫాలోవర్స్‌ ను ఒక్క పోస్ట్ పెంచేసింది. YES!I am a Woman.I have breasts AND a cleavage! You got a problem!!??  బోల్డ్‌ నెస్‌ గా మాట్లాడుతూ.. ‘అవును.. నేను స్త్రీని. కాబట్టే స్త్రీకి ఉండాల్సినవన్నీ ఉన్నాయి. మీకేమన్నా ప్రాబ్లమా?’ అంటూ పోస్ట్ పెట్టింది.  ఆమె ధైర్యాన్ని అభిమానులు, మహిళలు, సినిమా ఇండస్ట్రీలోని మహామహులంతా కొనియాడారు.

 

 

 ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో అధిక ఫోలోవర్స్‌.. 49.9 మిలియన్‌ (4 కోట్ల 99 లక్షలు) పాప్‌ గాయనిగా పరిచయమయ్యారు. అక్కడి టెలివిజన్‌ సిరీస్‌ లో నటనతోనూ వాళ్లను మెప్పించారు ప్రియాంక. పాప్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ ను ప్రియాంక పెళ్లాడారు. ఆ ముచ్చట్లను ఫోటోగ్రాఫ్‌లుగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ఫాలోవర్స్‌నూ తన అకౌంట్‌కు కట్టిపడేస్తున్నారు. 

 

 

నేపాల్ లో పుట్టిపెరిగిన నిషా గురగైన్ టిక్ టాక్ లో 21.7 మిలియన్ ఫాలోవర్స్. ఆమెకు సినిమాలంటే మక్కువ ఎక్కువ. అలా సినిమాల కోసం వెతుక్కునే ఆమె సోషల్ మీడియా లో ప్రతిభను ప్రదర్శించి నిలదొక్కుకున్నాడు. బాలీవుడ్‌ కంటే ముందు టిక్‌ టాక్‌లో స్టార్‌ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: