కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న భూతమిది.. ఒకటి, కాదు రెండు కాదు.. ఏకంగా వంద దేశాలను చుట్టుముట్టిన సమస్య ఇది. కరోనా కారణంగా ప్రాణాలు పోవడంమే కాదు.. అనేక రంగాలు కుదేలయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ కరోనా కుదేలు చేస్తోంది.

 

 

ఒక్క ఇండియాలో ఒక్క రోజులో స్టాక్ మార్కెట్లలో 7 లక్షల కోట్లు ఆవిరైపోయిన సంగతి తెలిసిందే. మరి ఈ కరోనా ప్రభావంతో ప్రపంచానికి ఎంత నష్టం జరుగుతోంది.. ఈ ప్రశ్నకు సమాధానం ఊహించారా.. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది రూ.148 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అంటున్నారు.

 

 

ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు. ఐక్య రాజ్య సమితి ఆర్థికవేత్తల అంచనా ఇది. కరోనా కారణంగా కొన్ని దేశాలు మాంద్యంలో చిక్కుకుపోతాయని వారు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడుతుందని ఐక్య రాజ్య సమితి ఆర్థిక వేత్తలు అంటున్నారు. కరోనా కారణంగా అనేక రంగాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది.

 

 

చమురు కు డిమాండ్ బాగా పడిపోయింది. చైనా, ఇటలీ వంటి దేశాలలో జనం ఇళ్లకే పరిమితం అవ్వడమే ఇందుకు కారణం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కారణంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇలా ఒక దానితో ఒకటి సంబంధం ఉన్న అనేక సంస్థలు కుప్పకూలుతున్నాయి.

మొత్తానికి కరోనా కారణంగా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 150 లక్షల కోట్లు ఆవిరైపోయాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: