ఎప్పటి నుంచో సైకిల్ దిగాలని చూస్తున్నా అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో విశాఖ టిడిపి ఎమ్మెల్యేలు చాలా కాలంగా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక దశలో వారు వైసీపీలోకి వెళ్దామని చూసినా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో బిజెపిలో చేరాలనే ప్రయత్నాలను వారు విరమించుకున్నారు.  టిడిపి ప్రజా ఉద్యమాల ద్వారా బలం పెంచుకుంటున్నట్టుగా కనిపించడంతో పార్టీ మారాలన్న వీరంతా వేచి చూసే ధోరణిని వీరంతా అవలంబించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా టిడిపి నుంచి బయటపడాలని చూస్తున్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్నారు.

IHG


 వైసీపీ ప్రభుత్వానికి ఎలాగూ ప్రజల ఆదరణ ఎలా ఉంది. మరో నాలుగేళ్లపాటు అధికారంలో ఉంటుంది. అయితే టిడిపి ఇప్పుడున్న పరిస్థితుల్లో బలం పుంజుకుంటుందా లేదా అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలిపోయే అవకాశం ఉండడంతో, ఫలితాలను బట్టి పార్టీ మారే విషయమై నిర్ణయం తీసుకోవాలని విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. విశాఖ నగరంలో తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గల్లో  టిడిపి ఎమ్మెల్యేలు గెలిచారు. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్, పశ్చిమ నుంచి గణబాబు గెలిచారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత గంటా శ్రీనివాసరావు తప్పించి మిగతా వారంతా టిడిపి కార్యక్రమాలకు, అసెంబ్లీ కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు.

IHG


 గంటా  ఒక్కరే టిడిపిలో లో ఉన్నా, లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక జగన్ ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయంతో గంటా లో స్పష్టమైన మార్పు కనిపించింది. జగన్ తీసుకున్న నిర్ణయానికి ఆయన జై కొట్టారు. బహిరంగంగానే మూడు రాజధానులు మద్దతు ప్రకటించారు. పార్టీకంటే ప్రాంతమే తనకు ముఖ్యమని చెప్పారు. ఇక చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖ వచ్చినా గంటా మాత్రం హాజరు కాలేదు.


 ప్రస్తుతం విశాఖలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారాలని బలమైన నిర్ణయానికి వచ్చేశారు. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే, వచ్చిన ఫలితాలను బట్టి పార్టీ మారాలని వారు చూస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి వీరు అంతగా ప్రాధాన్యం ఇవ్వనట్టుగా వ్యవహరిస్తుండడంతో.. ఇప్పటికే వీరికి అధికార పార్టీ నుంచి ఏవైనా సానుకూల సంకేతాలు వచ్చాయా అని అనుమానం టిడిపి వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: