తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలుసిందే.  ఒక కండక్టర్  స్థాయి నుంచి ఏకంగా భారతదేశ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు రజినీకాంత్. రజినీకాంత్ స్టయిల్ రజినీకాంత్ డైలాగ్ డెలివరీ కి ఎంతో మంది ప్రేక్షకులు ఉన్నారు. ఇకపోతే ఎన్నో రోజులుగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు అని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అటు రజనీకాంత్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పలు పార్టీలపై విమర్శలు చేయడం కూడా జరిగింది. బిజెపి పార్టీ తనను బిజెపిలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తోంది అంటూ పలుమార్లు విమర్శలు కూడా చేశారు రజినీకాంత్. ఇక తాజాగా త్వరలో రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు చెప్పకనే చెప్పారు రజినీకాంత్. 

 

 తాజాగా తమిళనాడులోని రజని  మక్కలు  మండ్రల్  ఆఫీస్ బేరర్లతో  తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ అయ్యారు. 15 ఏళ్లుగా తన రాజకీయ ప్రవేశంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. 2017  డిసెంబరు లో తన రాజకీయ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చానన్నారు రజినీకాంత్. ఇక అప్పటి నుంచి తమిళనాడులోని రాజకీయ పరిస్థితులను విశ్లేషించడం మొదలు పెట్టాను అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా ప్రస్తుత రాజకీయాల్లో సమయానికి తగిన పరిపాలన సాగటం లేదు అన్నారు రజినీకాంత్. త్వరలో తాను రాజకీయ పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. 

 


 తమ రాజకీయ పార్టీలో యువతకే పెద్దపీట వేస్తామని అంటూ చెప్పుకొచ్చారు. తాను  కేవలం పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే కొనసాగుతానని ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం వేరే వారిని నిలబెడతాను అంటూ చెప్పుకొచ్చారు. విద్యావంతుడు విజ్ఞాన వంతుడు అయిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా నిలబెడతాను అంటూ తెలిపారు. ఇప్పటివరకు తనపై వచ్చిన ఊహాగానాలు అన్నింటికీ  స్వస్థి  చెప్పాల్సిన సమయం వచ్చింది అన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు రజనీకాంత్. రాజకీయాల్లోకి యువతకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓ వైపు పార్టీపై మరోవైపు ప్రభుత్వం పై ఒక వ్యక్తి పెత్తనం  వుండకూడదు అంటూ తెలిపారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపిన రజినీకాంత్.. తనకు సీఎం పదవి పై ఇలాంటి వ్యామోహం లేదు అంటూ చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చి నంత మాత్రాన రాజకీయాల్లో మార్పు రాదని ప్రజల్లో  కూడా మార్పు రావాలి అంటూ చెప్పుకొచ్చారు రజినీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: