70 లక్షల రూపాయల లాటరీ తగిలిందని కేరళ కి చెందిన ఒక వ్యక్తి తెగ సంబరపడిపోయాడు. కానీ తన సంతోషం కేవలం కొన్ని గంటల్లోనే విషాదంగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే... కేరళలోని అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి.తంబి ఒక దుకాణ షాప్ ని నడిపిస్తున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం అతను చాలా లాటరీ టికెట్లు కొని విక్రయించాడు. అన్నీ అమ్ముడు పోయాయి కానీ పది టిక్కెట్లు మాత్రం మిగిలిపోయాయి.




ఐతే లాటరీ ఫలితాలు ప్రకటించే రోజు ఆ పది టికెట్ల లోని ఒక టికెట్ కి 70 లక్షల రూపాయలు లాటరీ తగిలింది. దాంతో తంబి తెగ సంతషపడుతూ ఈ విషయాన్ని తన బిడ్డలకు, భార్యకి చెప్పి ఆనందభాష్పాలు కార్చాడు. టాక్స్ లు పోనూ 60 లక్షల రూపాయలు చేతికి వస్తాయని, ఆ క్యాష్ తో తన దుకాణాన్ని పెద్ద షాప్ గా మారుద్దామని, మిగిలిన డబ్బుతో తన కూతుర్లకు హెల్ప్ చేద్దామని అతడు భావించాడు. కానీ విధి వక్రీకరించి అతను అనుకున్న ఆశలన్నీ తుడిచివేసింది.




లాటరీ డబ్బులను తీసుకుందామని మంకంకుజీలోని ఫెడరల్ బ్యాంకుకు తంబి వెళ్ళాడు. అక్కడ తన రూ. 70 లక్షల లాటరీ టికెట్ సమర్పించాడు. కానీ ఇంతలోపే తన ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడం ప్రారంభమైంది. దాంతో తంబి అక్కడికక్కడే కొప్పుకూలిపోయాడు. ఇది గమనించిన కొంతమంది తంబి ని మావెలికర జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆయన చికిత్స పొందుతూ తన తుది శ్వాస విడిచాడు. ఈ విషాద విషయాన్ని తెలుసుకున్న తంబి భార్య సరస్వతి, కుమార్తెలు సరిత, సవిత ఆస్పత్రికి చేరుకొని లబోదిబోమంటూ కన్నీరుమున్నీరయ్యారు. 70 లక్షల లాటరీ తగిలింది కదా తంబి కష్టాలన్నీ పోతాయని భావించిన ఆ కుటుంబానికి చివరికి ఆయనే లేకుండా పోయాడు. ఈ సంఘటన స్థానికులను కూడా కలిచివేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: