దేశం అంతటా ఉన్న కరోనా మన తెలంగాణ రాష్ట్రంలో లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన ఈ విషయం చెప్పిన కొద్దిసేపటికే షాకింగ్ న్యూస్ వచ్చింది. వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. నిట్‌లో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయనే వార్త దావానంలా వ్యాపించింది. దీంతో విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు వరంగల్ MGM ఆసుప్రత్రి సూపరిటెండెంట్‌తో మాట్లాడింది. 

 

కాజీపేటకు చెందిన ఓ యువకుడు జ్వరం, గొంతు నొప్పితో బాధ పడుతూ తమ ఆస్పత్రికి వచ్చాడని డాక్టర్స్ వెల్లడించారు. మార్చి నెలలో యూఎస్ నుంచి రిటర్న్ వచ్చినట్లు, అనంతరం కర్నూలుకు వెళ్లి..వచ్చినట్లు చెప్పాడన్నారు. కొద్ది రోజులుగా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పాడన్నారు. 

 

విదేశాల నుంచి రావడంతో కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో అతనికి చికిత్స చేయడంప్రారంభించారు. ఇతని రక్తనమూనాలను గాంధీ ఆసుపత్రికి పంపించాలా ? ఇతర విషయాలు తెలుసుకోవడానికి ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ఇతర విద్యార్థులకు కరోనా లక్షణాలున్నాయని వచ్చాయనే సంగతి తమకు తెలియదని, అతను ఒక్కడే వచ్చాడని తెలిపారు. 


కరోనా ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆసుపత్రుల ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా ప్రభావం పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోళ్ల అమ్మకాలు నిలిచిపోతున్నాయి. చికెన్ ధర అమాంతం పడిపోయింది. ఫ్రీగా చికెన్, కోళ్లు ఇస్తామన్నా.. వినియోగదారులు ముందుకు రావడం లేదు. రేటు మరీ దారుణంగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగానికి కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతోంది. 

 

కరోనా ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా కోళ్ల పరిశ్రమ దాదాపు 8వేల కోట్ల వరకూ నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. చికెన్‌, గుడ్ల వినియోగంతో ఎవరికీ కరోనా వైరస్‌ సోకదు. ఇదంతా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారమని పౌల్ట్రీ ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. ఈ వైరస్‌ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: