స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసలే కష్టాలకు ఎదురీదుతున్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఏ విధంగా గట్టెక్కాలనే విషయంపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఎన్ని చేసినా పార్టీ కి దక్కే స్థానాలు అంతంత మాత్రమే అని తేలిపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయింది.ఇదే సమయంలో వైసీపీలోకి తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, అత్యంత కీలకమైన వ్యక్తులు పార్టీని వీడి అధికార పార్టీ వైసీపీలో చేరడమే కాకుండా, ఆ సందర్భంగా వారు పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడంతో చంద్రబాబు తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అవి ఏవి సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరాశలో చంద్రబాబు ఉన్నారు. 

 

IHG

ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన రాయలసీమ నేతలు వరుసగా వైసీపీలోకి క్యూ కడుతున్నారు. జమ్మలమడుగు చెందిన రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరగా, పులివెందుల సతీష్ రెడ్డి చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో కీలక నాయకుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ అయిన మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ లోకి వచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నుంచి ఆయనకు ఎటువంటి ఆహ్వానాలు వెళ్లకపోయినా, తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి తో ఉన్న ఆయన, ఆ కోపంతోనే వైసీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

 

IHG


ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులకు టిక్కెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సమయం నుంచి ప్రభాకర్ పార్టీ మారేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం తనను గుర్తిస్తుందని ఆశాభావంతో ఉంటూ వచ్చారు. కానీ పార్టీ ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇప్పుడు వైసీపీ గూటికి వెళ్లేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన కార్యకర్తలతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ప్రభాకర్ కనుక వైసీపీ కండువా కప్పుకుంటే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: