దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జోరు వాన కురుస్తూ ఉండటంతో ప్రజల్లో మరింత భయం కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నుండి ఇక్కడి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని సమాచారం. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు దాదాపు రెండు గంటల నుండి ఎన్సీఆర్ ప్రాంతమంతా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. 
 
వైద్యులు వాతావరణంలో మార్పుల వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 31వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఢిల్లీలో థియేటర్లు, పబ్బులు, రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. 
 
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. కరోనా ప్రభావాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను ఈ నెలాఖరు వరకు మూసేయాలని నిర్ణయించింధి. రాష్ట్రంలో జరుగుతున్న పరీక్షలను యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. స్కూళ్లతో పాటు థియేటర్లు, షాపింగ్ మాల్స్ ను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం లక్షణాలతో వచ్చేవారికి ఓపీ నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం వైరస్ వ్యాపించకుండా గ్రామ, వార్డ్ వాలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 83కు చేరింది. దేశంలో కరోనా సోకి ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.      

మరింత సమాచారం తెలుసుకోండి: