తల్లిదండ్రులు వారు పడే కష్టాలు పిల్లలకు రావొద్దని ఆలోచిస్తారు. వారికీ ఎంత కష్టమైన పిల్లలను చదివించి మంచి స్థాయిలో చుడాలనుకుంటారు. అలాగే ఓ తల్లి పాచి పనులు చేసుకుంటూ తన కొడుకును చదివించింది. ఆ తల్లి కోరుకునట్టుగానే కొడుకుని ఇంజనీరింగ్ చదివించింది. కానీ అతను సోషల్ మీడియాకు బానిసైన మహిళలు, అమ్మాయిలకు వలవేసి అందినకాడికి దోచేస్తున్న ఘరానా మోసగాడిగా తయారైయ్యాడు. 

 

చెన్నైకి చెందిన సి.విఘ్నేశ్(23) కడలూరులోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదివాడు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రముఖుల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసేవాడు. అతని ఫేక్ అకౌంట్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన యువతులతో చాటింగ్ చేసి ముగ్గులో దింపి బాగా దగ్గరయ్యేవాడు. మహిళల అశ్లీల చిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడేవాడు.

 

విఘ్నేష్ ఓ సీరియల్ యాక్టర్ పేరుతో సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేశాడు. పదే పదే ఆ నటుడి ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు. ప్రస్తుత జనరేషన్ లో సెలెబ్రేటిస్ అంటే ఎవరు మాత్రం ఇష్టపడరు. అతను నిజంగానే సీరియల్ నటుడని నమ్మేసిన మహిళలు, అమ్మాయిలు పెద్దఎత్తున ఆ అకౌంట్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్‌‌లు పెట్టేవారు. 

 

అనంతర విఘ్నేష్ ఫోన్ నంబర్లును చేంజ్ చేసుకోని వాట్సాప్ చాటింగ్‌ చేసేవాడు. అమ్మాయిలు పూర్తిగా అతనిని నమ్మరని నిర్ధారించుకున్నాక వారిని న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపమని అడిగేవాడు. వారు సెలెబ్రెటీ మీద ఉన్న పిచ్చితో ఆ ఫొటోలు పంపేవారు. వారు ఫొటోస్ పంపిన తర్వాత అతని అసలు రూపం చూపించేవాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే వాటిని పోర్న్ సైట్లలో పెడతానని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజేవాడు.

 

న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి అందినకాడికి దోచుకునేవాడు. ఇటీవల ఓ యువతిని పుదుచ్చేరి తీసుకెళ్లి లైంగికంగా వేధించడంతో విఘ్నేష్ బాగోతం బయటపడింది. దింతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: