చైనాలో పుట్టి అన్ని దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ వైరస్ వల్ల బయటకు వెళ్లాలన్న వణుకొస్తోంది. ఎక్కడ ఎవరి నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే ప్రజలు పరిశుభ్రంగా ఉండాలని, తమ చేతులను శానిటైజర్లతో కడగాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ సూచించింది. షేక్ హ్యాండ్, కౌగిలింతలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. పరిస్థితులు ఇంత దారుణంగా, చేయిదాటిపోయిన పరిస్థితి ఏర్పడితే ఓ వ్యక్తి తన భార్యకు తెలియకుండా ఇటలీ ట్రిప్‌ కు వెళ్లాడు. తన ప్రియురాలితో అక్కడ బాగా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత అతనికి ఓ షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే... 
యూకేకు చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ట్రిప్ కి వెళ్ళటానికి ప్లాన్ వేశాడు.

 

అతనికి పెళ్లయింది కానీ ట్రిప్ కి వెళ్లే విషయం భార్యకు తెలియకూడదని జాగ్రత్తపడ్డాడు. తన భార్యతో కూడా బిజినెస్ ట్రిప్ మీద ఇటలీకి వెళ్తున్నానని చెప్పాడు. అలా ఇటలీకి బయలుదేరి ఒక వారం రోజులు అక్కడ గడిపి బాగా ఎంజాయ్ చేశాడు. అతను తిరిగి వచ్చాక షాకింగ్ విషయం తెలిసింది. ఏంటంటే అతనికి కరోనా సోకిందని. ఇంటికి వచ్చిన కొద్ది రోజుల తర్వాత అతడికి తీవ్రమైన జ్వరం, దగ్గు వచ్చాయి. వైద్య పరీక్షల్లో అతడికి కరోనా వచ్చిందని తెలియడంతో అతడు షాకయ్యాడు. 

 

కరోనా వైరస్ సోకిందని తెలిసిన వైద్యులు అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అలాగే అతడి భార్యను ఇంట్లోనే ఉంచి ఐసోలేషన్‌ ఏర్పాట్లు చేశారు. నీకు కరోనా ఎలా సోకింది. ఎక్కడికి వెళ్ళావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు డాక్టర్లు. దీంతో అతడు బిజినెస్ ట్రిప్ మీద ఇటలీ వెళ్లానని చెప్పాడు. అతను పనిచేస్తున్న కంపెనీకి కాంటాక్ట్ అయ్యి అసలు విషయం తెలుసుకున్నారు. ఆ వ్యక్తి వారం రోజుల పాటు సెలవు తీసుకున్నాడని అయన చెప్పాడు. అతడిని ఏ బిజినెస్ ట్రిప్‌ కు పంపలేదని తెలిపారు.

 

అతడికి కరోనా నిర్ధరణ జరిగిందని తెలియడంతో తమ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పించామని తెలిపింది. అతని భార్యకు ఇంకా అసలు విషయం తెలియదన్నారు. అధికారులు గట్టిగా నిలదీయడంతో బాధితుడు నిజం చెప్పాడు. తన ప్రియురాలితో కలిసి ఇటలీలో పర్యటించానని తెలిపాడు. అక్కడే తనకు ఈ వైరస్ అంటుకుని ఉండవచ్చని ఈ విషయం తన భార్యకు తెలియదని, దయచేసి చెప్పొద్దని అన్నాడు. అతనితో పాటు వచ్చిన ఆ యువతీ పేరును బయట పెట్టలేదు. అతను చెప్పకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు అధికారులు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: