సాధారణంగా ఎవరికైనా కోపం వస్తే శబ్దం పైకి వినిపించేలా పళ్ళు గట్టిగా కొరుకుతూ ఉంటారు. కానీ ఇది ఇతర సమయాల్లో ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు ఎవరైనా చేస్తే అది చాలా ప్రమాదకరం. చిన్న పిల్లలు నిద్రలో పళ్ళు కొరకడం మనం సాధారణంగా గమనిస్తూనే ఉంటాం. తల్లిదండ్రుల పక్కన పడుకున్న పిల్లలు కటకటా అంటూ పళ్ళు కొరికితే వారికి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది కూడా. వాహనాల హారన్ వినడం, గరుకు చాక్ పీస్ తో బోర్డు పై గీకడం, పళ్ళు కొరకటం లాంటి శబ్దాలు ఎవరికైనా తీవ్రమైన చికాకు కలిగిస్తాయి. అయితే పళ్ళుకొరుడాన్ని వైద్యపరిభాషలో బ్రక్సిజం అని అంటారు. ఆరు నుండి ఏడు సంవత్సరాల పిల్లలలో ఈ బ్రక్సిజం అధికంగా కనిపిస్తుంది. బిగ్గరగా కొరకటం వలన వారికి దవడల నొప్పి రావటం, చెవుల కింద నొప్పి రావటం లాంటివి జరుగుతుంటాయి. పళ్ళు కూడా పాడవడంతో పాటు తలనొప్పి లాంటి సమస్యలు వస్తుంటాయి.




ఐతే చిన్నపిల్లల్లో పళ్ళుకొరుకుట సమస్య ఎందుకు వస్తుందనేది ఇప్పటివరకు తెలియరాలేదు. సాధారణంగా పీడకలలు వలన పిల్లలు పళ్ళు గట్టిగా కొరుకుతారని చాలా మంది భావిస్తుంటారు. అయితే ప్రముఖ వైద్యులు ప్రకారము ఈ క్రింది కారణాలు పళ్ళుకొరుకుట సమస్యకు కారణం కావచ్చు.




ఒత్తిడి, బలహీనత, శీతల పానీయాలు తాగడం, చాక్లెట్లు తినడం, జలుబు, ఎలర్జీ, శ్వాస సంబంధిత సమస్యలు వలన, మానసిక స్థితి సరిగా లేకపోవడం లాంటి అనారోగ్య సమస్యలతోపాటు చెడు జీవనశైలి పళ్ళుకొరుకుట సమస్యలకు దారి తీస్తుంది.




అయితే సాధారణంగా అందరు పిల్లలు కాస్త పెద్దయిన తర్వాత పళ్ళుకొరుకుట సమస్యను అధిగమిస్తారు. కానీ కొంతమంది మాత్రం తరచూ పళ్లను కోరుకుతూనే ఉంటారు. అటువంటి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వారి పళ్ళలో ఎనామిల్ తీవ్రంగా చెడిపోవడంతో పాటు వారికి పళ్ళ పుచ్చులు లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. డాక్టర్ని సంప్రదించికపోతే పళ్ళు కొరుకుట సమస్య ఎందుకు వస్తుందో తెలియదు. వైద్యుల్ని సంప్రదిస్తే ఆ సమస్య ఎందుకు తలెత్తుతుందో వెంటనే పరిశీలించడం జరుగుతుంది.




అలాగే మీరు ఇంట్లో కొన్ని పద్ధతులను పాటించి పిల్లలు పళ్ళుకొరుకుట సమస్యలను నిర్మూలించవచ్చు. కాఫిన్, చాక్లెట్ లాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండడంతో పాటు వెచ్చని నీటితో స్నానం చేయించడం, ప్రశాంతమైన సంగీతాన్ని వినిపించడం లాంటివి చేస్తే పిల్లల యొక్క పళ్ళ కొరుకుట సమస్యను నిర్మూలించవచ్చు. అలాగే మీ పిల్లలకు తగినంత ఆహారం తినిపించి విధంగా ప్రతి రోజు చూసుకోండి. పిల్లలపై ఒత్తిడి ఇలాంటి సమస్యలు ఉంటే వాటిని తొలగించేందుకు ప్రయత్నించండి.






మరింత సమాచారం తెలుసుకోండి: