పొట్టకూటి కోసం ఢిల్లీ వీధుల్లో పళ్లు అమ్ముకుని బతికే ఓ యువకుడు.. మద్యానికి బానిసై చేయకూడని తప్పే చేశాడు....స్నేహితులతో కలిసి నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డాడు... జువైనల్‌గా చూపించి పవన్ గుప్తాను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు అతని తరపు న్యాయవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా... అవి ఫలించలేదు.

 

పవన్ గుప్తా అలియాస్ కాలు... అమ్మానాన్న...తమ్ముడు చెల్లెలితో కలిసి ఢిల్లీలోనే నివాసం... ప్రస్తుతం పవన్ గుప్తా వయసు 27 యేళ్లు... నిర్భయ ఘటన జరిగినప్పుడు పవన్‌కు 19 సంవత్సరాలు.  నిర్భయపై అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి పారిపోయిన పవన్ గుప్తా... కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్ని అబద్దాలు చెప్పాలో అన్నీ చెప్పాడు... అత్యాచారం జరిగిన రోజు అసలు తాను ఆ బస్సులోనే లేనన్నాడు.

 

మురికి వాడలు, బస్తీల్లో పళ్లు అమ్ముకునే పవన్ గుప్తాకు చెడు స్నేహాలు చాలానే ఉన్నాయి. దోషుల్లో మిగతా వాళ్లతో కలిసి మద్యం సేవించడం... అల్లరిచిల్లరగా వ్యవహరించడం పవన్‌కు ఎప్పటి నుంచో అలవాటు. నిర్భయ ఘటన జరిగిన రోజు కూడా పవన్ బాగా మద్యం సేవించి ఉన్నాడు... నిర్భయపై దాడి జరిగిన రోజు మధ్యాహ్నమే ఫ్రూట్ షాప్‌ను మూసేశాడు పవన్ గుప్తా... అ తర్వాతే స్నేహితులతో కలిసి ఘోరానికి పాల్పడ్డాడు.

 

అయితే వినయ్ శర్మతో కలిసి తాను మ్యూజిక్ షోకు వెళ్లానని... అత్యాచార ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్ గుప్తా వాదించాడు. వయసును దృష్టిలో పెట్టుకుని జువైనల్ హోంకు తరలించాలని పవన్ తరపు న్యాయవాది కోర్టును చాలా సార్లు కోరారు. వయసు నిర్ధారణ కోసం అవసరమైతే ఎముకల పరీక్షలు కూడా నిర్వహించాలని కోరారు. అయితే జడ్డి దానికి అంగీకరించలేదు. అధికారిక లెక్కలనే ఏజ్ ప్రూఫ్‌గా తీసుకున్నారు. పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, వినయ్ శర్మల వయస్సు తక్కువే అయినా... అత్యంత హీనమైన నేరానికి పాల్పడినందుకు వాళ్లకు బతికే హక్కులేదని తీర్పు ఇచ్చారు.

 

తీహార్ జైలుకు వచ్చిన తర్వాత కూడా పవన్ గుప్తా తన ప్రవర్తనను మార్చుకోలేదు. జైలు నిబంధనలను పదేపదే ఉల్లంఘించాడు.  జైల్ రూల్స్ పాటించనందుకు ఎనిమిది సార్లు పవన్ గుప్తాకు జైలు అధికారులు పవన్‌కు శిక్ష కూడా వేశారు. జైల్లో ఉండగా 29 వేలు సంపాదించాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: