2012వ సంవత్సరం డిసెంబర్ 12న దక్షిణ ఢిల్లీలో కదులుతున్న బస్సులోని ఒక మెడికల్ స్టూడెంట్ పై ఆరుగురు దుండగులు కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై ఆమెను తీవ్రంగా గాయపరిచారు. దాంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు నిర్భయ ప్రాణాలు కోల్పోయింది. ఐతే నిందితులైన ఆరుగురిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆ ఆరుగురు లో ఒకతను ఆత్మహత్య చేసుకోగా మరొకరు మైనర్ కావడంతో అతడు మూడేళ్ల శిక్ష ని అనుభవించి విడుదలయ్యాడు.




అయితే 2013 సెప్టెంబర్ నెలలో మిగతా నలుగురు కి ఉరి శిక్ష పడేలా చేసారు సీమ సమృద్ధి అనే ఓ యుక్తవయస్సు లాయర్ బాధితుల తరపున వాదించిన ఈ సీమ సమృద్ధి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే మరోవైపు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే చదువుల్లో చాలా చురుకైన ఈమె మొట్టమొదటిగా నిర్భయ కేసునే టేకప్ చేసారు. ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు తాను నిర్భయ తల్లి కి అండగా ఉంటూ దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్ వేసే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కేసులో ముందడుగు వేశారు. సీమా సమృద్ధి వాదనలతో 2013 సెప్టెంబరు నెలలో వీరికి మరణదండన తీర్పు కోర్టు విధించినా... దోషులు ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీమా సమృద్ధి తన సర్వ శక్తుల వాదనలు చేస్తూ 2014లో హైకోర్టు ని కూడా కింది కోర్టు ఇచ్చిన మరణదండన తీర్పును సమర్థించేలా చేసారు. దాంతో దోషాలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. సుప్రీంకోర్టు వీరి ఉరిశిక్షపై తీర్పు ఇచ్చే లోపు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. అనగా 2017 లో కింది కోర్టు, హైకోర్టు విధించిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.




అనంతరం జూలై 2018 నుండి మొన్నటి వరకు దోషులు ఎన్నో పిటిషన్లను సుప్రీంకోర్టు లో వేస్తుంటే... మరోవైపు సీమా సమృద్ధి పట్టువదలని విక్రమార్కుడిలా న్యాయపరమైన అంశాలపై అద్భుతంగా పట్టు సాధించి వీరి పిటిషన్లు అన్ని పటాపంచలు అయ్యేలా చేసారు. వాస్తవానికి నిర్భయ తల్లి తన కూతురికి న్యాయం జరిగేందుకు ఎంత పోరాటం చేసిందో... సీమా సమృద్ధి కూడా అంతే పోరాటం చేస్తూ ఒక్కరోజు కూడా నిరాశ చెందకుండా ఆశా దేవికి అండగా నిలుస్తూ ఆమెను ముందు అడుగులు వేసేలా చేశారు. సీమా సమృద్ధి ఒక లాయర్ కంటే ఎక్కువగా నిర్భయ కుటుంబ సభ్యులకు సాయం చేసి వారి బిడ్డకు న్యాయం జరిగేలా చేసి అందరి మన్ననలు పొందుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: