చాలామంది రాజకీయ నేతలు సున్నితమైన విషయాలపై తప్పుగా మాట్లాడి అందరి చేత ట్రోల్ చేయబడతారు. గతంలో చటాన్ పల్లి వద్ద హత్యాచారానికి గురైన దిశ కేసులోని నిందితుల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారని అతనిపై భారీ లెవల్లో విమర్శలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంటుంది, చంపడం కరెక్ట్ కాదు కావాలంటే రెండు బెత్తం దెబ్బలు వేయండి అని చెబుతున్న పవన్ కళ్యాణ్ వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే.

 

 

అయితే తమ్ముడికి సపోర్ట్ గా నిలిచేందుకు నాగబాబు రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలను వక్రకరించి వేరే అర్థం వచ్చేలా కొంతమంది చేశారని చెప్పుకొచ్చారు. ఏదేమైనా జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు సున్నితమైన నిర్భయ కేసు గురించి పెదవి విప్పారు. నిర్భయ పై దాడి జరిగిన దాదాపు 8 సంవత్సరాల తర్వాత నిందితులకు ఈరోజు ఉదయం ఉరి శిక్ష పడింది. అయితే సామాజిక స్పృహ ఉన్న జనసేన పార్టీ నేతలు నిర్భయ దోషుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు.

 



శుక్రవారం ఉదయం నలుగురిని ఒకేసారి ఉరి తీసి చాలా గొప్ప పని చేసి మన న్యాయ వ్యవస్థ పై నమ్మకం ప్రజల్లో కలిగించారని... కానీ అలా ఉరి తీసి చిన్న తప్పు చేశారని నేతలు అభిప్రాయపడ్డారు. ఉరి తీసే దేదో బహిరంగంగా ఉరి తీసినట్లు అయితే మిగతా కామాంధులకు భయం కలిగి కాస్తయినా మార్పు వచ్చి ఉండేదని ఈ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. నిర్భయ మరణానికి కారణమైన మానవ మృగాలకు ఉరి శిక్ష పడిన ఈరోజు ఒక గొప్ప సూర్యోదయం అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబ సభ్యుల తరఫున వాదించిన లాయర్లు చరిత్రలో నిలిచిపోతారని ఆయన అన్నారు. అలాగే ఆంధ్రరాష్ట్రంలో విప్లవాత్మక దిశ చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ కి ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే ఆయేషా మీరా, సుగాలి ప్రీతీ ల విషయంలో న్యాయం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: