నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వెళ్ళిన లేఖ వివాదంలో మీడియా కూడా ఇరుక్కుంటుందా ? ఇపుడిదే అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పైగా నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖ పచ్చమీడియాలో మాత్రమే హైలైట్ అవ్వటంతో వివాదం మరింతగా పెరిగిపోయింది. వైసిపి ఎంఎల్ఏల ఫిర్యాదుతో పోలీసులు ఇపుడిదే అంశంపై దర్యాప్తు మొదలుపెట్టినట్లు సమాచారం.

జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు ప్రధానప్రతిపక్షం తెలుగుదేశంపార్టి ప్రయత్నించటం సహజం. మొన్నటి ఎన్నికల్లో జగన్ ను దెబ్బ కొట్టటానికి చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నాలు లేవు. తనకు మద్దతుగా సర్వ వ్యవస్ధలను ఉపయోగించుకున్నాడు. ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నించినా జనాల మద్దతు లేకపోవటంతో తెలుగుదేశంపార్టీ గూబ పగిలిపోయింది. మీడియాను అడ్డం పెట్టుకుని జగన్ పై చంద్రబాబు ఎంత బురద చల్లాడో అందరూ చూసిందే.

 

సీన్ కట్ చేస్తే బంపర్ మెజారిటితో జగన్ అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబును కాదని జనాలు జగన్ కు అధికారం కట్టబెట్టడంతో బహుశా మెజారిటి మీడియా అధిపతులకు కూడా ఒళ్ళు మండిపోతోంది. అందుకే ఇటు జగన్ తో పాటు అటు జనాలపైన కూడా తమిష్టం వచ్చినట్లు విషం చిమ్ముతున్నారు.  ఇంతకీ ఇపుడు విషయం ఏమిటంటే గడచిన వారం రోజులుగా ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రంగా జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే.

 

ఈ వివాదంలో మీడియానే ప్రముఖ పాత్ర పోషించినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు వెళ్ళిన లేఖ సంచలనం సృష్టించింది. కేంద్ర హోంశాఖకు లేఖ చేరటం ఒక ఎత్తైతే ఆ లేఖకు  పచ్చమీడియా విపరీతమైన ప్రచారం కల్పించటం మరోఎత్తు. ఎందుకంటే ఆ లేఖలో జగన్ గురించి చాలా డ్యామేజింగ్ గా ఉంది. పైగా కేంద్ర హోంశాఖకు తాను ఎలాంటి లేఖ రాయలేదని స్వయంగా నిమ్మగడ్డే చెప్పినట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్ధ ట్విట్టర్లో పెట్టింది. దాంతో వివాదం మరింతగా పెరిగిపోయింది.

 

సరే  ఈ వివాదం ఎలాగున్నా వైసిపి నేతల ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ దర్యాప్తులో టిడిపిలోని ఓ కీలక యువనేత ఐదుగురు మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలిసిందట. సదరు యువనేత మాట్లాడిన తర్వాతే ఆయన పిఏ ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు సదరు లేఖను వాట్సప్ లో పంపాడట. ముందుగా వచ్చిన ఆదేశాల ప్రకారమే లేఖను అందుకున్న మీడియా కూడా దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయంటున్నారు. చూడబోతే మరిన్ని ఆధారాలు దొరికిన తర్వాత పోలీసులు సదరు మీడియా ప్రతినిధులపైన కూడా కేసులు పెట్టేట్లే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: