కరోనా క్రమంగా వ్యాపిస్తోంది. దీన్ని ఆరంభంలో అరికట్టకపోతే.. ముందు ముందు అరికట్టడం చాలా కష్టం అవుతుంది. గొలుసుల తరహాలో వ్యాపించే ఈ కరోనాను ఆరంభంలో గొంతు నులిమేయాలి. కానీ తెలంగాణలో ఇప్పటికే రెండో దశ కేసు నమోదైంది. అంటే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి స్థానికులకు వైరస్ వ్యాపించడం అన్నమాట.

 

 

దుబాయి నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ వృద్ధ వ్యాపారికి మూడు రోజుల క్రితం కరోనా వచ్చిందని నిర్థరించారు. ఆ తర్వాత అనుమానంతో అతని కుటుంబ సభ్యులకూ కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా 35 ఏళ్ల ఆయన కుటుంబ సభ్యుడికి వైరస్ సోకినట్టు నిర్థరణ అయ్యింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి సెకండ్‌ కాంటాక్ట్‌ ద్వారా రెండో వ్యక్తికి సోకడమనేది ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులందరి ఆరోగ్యంపై ఆరోగ్యశాఖ దృష్టి సారించింది.

 

 

ఏడుగురు కుటుంబ సభ్యులను విడి గదుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో మూడో దశలోకి వెళ్లకుండా చూసుకోవాలి. రెండో వ్యక్తి నుంచి మూడో వ్యక్తి కి అంటే థర్డ్‌ కాంటాక్ట్‌కి సోకకుండా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మూడో వ్యక్తికి సోకితో.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం చాలా కష్టం. ప్రస్తుతం తెలంగాణలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజూ ఒకటో రెండో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కానీ ఈ రెండో దశ, మూడో దశలోకి అడుగుపెడితే అప్పుడు రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతాయి.

 

 

అందుకే ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తెలంగాణలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి. అంతర్జాతీయ ప్రయాణికులందరూ తప్పని సరిగా క్వారంటైన్ లో ఉండాలి. అందుకే తెలంగాణకు ఈ జనతా కర్ఫ్యూ చాలా అవసరం. ఈ కరోనాకు అడ్డుకట్ట వేయడం జనం చేతుల్లోనే ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: