ఛత్తీస్‌గడ్‌లో మరోసారి మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు.. జరిగాయి.. సుక్మా అనే  జిల్లాలో ఇరు గ్రూపుల మధ్య, తుపాకుల కాల్పులు జరిగాయి. శనివారం అనగా, నిన్న అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ కాల్పుల్లో 14 మంది పోలీసులకు గాయాలు కాగా, మరో 13 మంది పోలీసులు కనిపించకుండా పోయారని సమాచారం. తీవ్రంగా గాయపడిన పోలీసులను హెలికాప్టర్‌లో రాయపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 

 

ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు కూడా భారీ సంఖ్యలో చనిపోయినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా.. పూర్తి సమాచారం తెలవాల్సి ఉంది. ఇది ఓ రకంగా మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ గానే పరిగణిస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్. అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోలు కనిపించడంతో కాల్పులు జరిగినట్లు మనకు తెలుస్తోంది. 

 

IHG

 

గతంలో కూడా ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ సంఘటనలు చోటుచేసుకున్నాయి.. ఆ మధ్య గొల్లపల్లి కన్నాయిగూడ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకూ మధ్య జరిగిన ఎదురుకాల్పులలో 14 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందినట్టు కుంట ఎస్పీ అభిషేక్ మీనా ధృవీకరించిన సంగతి తెలిసినదే. ఇక ఈ ఘటనా స్థలంలో ౧౬ హై రేంజ్డ్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

అలాగే... మల్కాన్‌గిరి జిల్లా సిల్లాకోట వద్ద అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ ఆ చుట్టు పక్కల వారిని భయ భ్రాంతులకు గురిచేసింది. అక్కడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసు బలగాలు, ఒక్కసారిగా వారిని చుట్టుముట్టి, మల్కాన్‌గిరి పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) అఖిలేశ్వర్ సింగ్ నాయకత్వంలో కాల్పులు జరిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందడంతో.. ఆ టైములో ఆంధ్రాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: