బాబోయ్.. 21 రోజుల లాక్ డౌన్.. దేశమంతటా కర్ఫ్యూ.. ఏకంగా ప్రధాన మంత్రే వచ్చి చెప్పాడు.. ఇక ముఖ్యమంత్రి కనిపిస్తే కాల్చిపడేసే ఉత్తర్వులివ్వాలా అంటూ ఉరుముతున్నాడు.. అందుకే ఇప్పుడే సరుకులు అన్నీ కొనేస్తా.. ఎందుకైనా మంచిది.. కరోనా ఎన్నాళ్లుంటుందో ఏమో.. ఓ రెండు మూడు నెలలకు సరిపడా సరుకులు కొంటా అనుకుంటున్నారా..?

 

 

నిజమే జాగ్రత్తపడటంతో తప్పేమీ లేదు.. జేబుపర్సులో నోట్లున్నాయనీ, బ్యాంకుకార్డులో కొనుగోలుశక్తి వుందనీ, షాపువాడివద్ద పరపతి వుందనీ, కారు డిక్కీలో చోటుందనీ కొనేస్తారా.. ఒక తరానికి సరిపడా సరుకులు ఇప్పుడే కొనేస్తారా.. అలాంటి పని చేయకండి.. ఎందుకంటే.. ఒక్కసారి క్యూలో వెనక్కి తిరిగి చూడండి.. మీ వెనకాల క్యూలో చిట్టచివర పావాలా, అర్ద రూపాయికి కూడా ప్రాణం చిక్కబట్టుకుని కొనే అభాగ్యులుంటారు.

 

 

మీరు కొనేయడంలొ చూపే ఆత్యాశకు అనుగుణంగా అమ్మే వాడిలో ధరలు పెంచే దురాశ ప్రతిధ్వనిస్తుంది. వ్యాపారి ఆశ పెరుగుతుంది. మరి అప్పుడు ఆ అభాగ్యుడి గతేం కాను.. మీ కొనుగోలు శక్తితో ధరలను పెంచేస్తే.. ఎంత అడిగితే అంత ఇచ్చేసి కొంటే.. సామాన్యుడి సంగతి ఏంటి..? మీరు సరుకులు పోగేయకపోతే .. ఏమవుతుంది.. నాలుగు రోజులు పచ్చడి మెతుకులో, ఎల్లిపాయ కారంతో నాలుగు ముద్దలు తింటేనో మీకు పెద్ద నష్టమేమీ కాదు కదా.

 

 

మహా అయితే ఏమవుతుంది.. మీకు మీ పిల్లలకు జీవితసారం పరిపూర్ణంగా అర్థమవుతుంది. జీవితాల్లో కష్టాలూ ఉంటాయని తెలిసొస్తుంది అంతే కదా.. అయినా అన్నీ నీ కొంపనిండా నింపేసుకుని, అంతా మీరే తినేసి, అందరూ ఆకలితో పోయాక, నువ్వొక్కడివే మిగిలి ఏం చేద్దామని? ఏం సాధిద్దామని ? అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. నిజమే కదా. జనం అంటే మనమందరం కదా.. మనం ఒక్కరే కాదు కదా.. ఇలా కూడా ఆలోచించాలి కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: