శానిటైజర్.. ఇప్పుడు బాగా వినిపిస్తున్న పదం ఇది. కరోనా భయంతో అంతా శానిటైజర్లు వాడుతున్నారు. ఊరికే చేతులు కడుక్కునే అవకాశం లేకుండా శానిటైజర్లు వాడుతున్నారు. ఈ శానిటైజర్ ఎలాంటి వైరస్ ల నైనా చంపేస్తుంది. అందుకే వీటి వాడకం ఇటీవల బాగా ఎక్కువైంది. అయితే ఈ శానిటైజర్ వాడే టప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

 

 

అదేంటంటే.. చేతులకు శానిటైజర్ రాసుకుని.. గ్యాస్ దగ్గరికి అస్సలు వెళ్లకూడదు. శానిటైజర్లు బయటకు వెళ్లే వారే కాకుండా ఇళ్లలో గృహిణులు కూడా వాడుతున్నారు. వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శానిటైజర్ రాసుకుని గ్యాస్ దగ్గరకు వెళ్లే గ్యాస్ పేలే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందట.

 

 

అందుకే శానిటైజర్ వాడే గృహిణులు ఈ విషయం తప్పకుండా గమనించాలి. శానిటైజర్ రాసుకుంటే.. ఇంత జరుగుతుందా? అనుకోవద్దు. ఎందుకంటే.. ఈ శానిటైజర్లలో ఎక్కువగా ఉండేది స్పిరిట్, ఆల్కాహాల్‌. ఈ రెండింటికీ మండే గుణం ఎక్కవ. అందువల్ల శానిటైజర్ రాసుకున్న వెంటనే మంట దగ్గరికి వెల్లకుండా ఉంటమే మచింది. శానిటైజర్ రాసుకున్న కాసేపటి వరకు బ్రేక్ తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మహిళలు వంట చేసే ముందు శానిటైజర్ వాడే అలవాటు ఉంటే జాగ్రత్తలు తప్పక పాటించండి.

 

 

సాధారణంగా శానిటైజర్ రాసుకున్న తర్వాత వెంటనే ఆరిపోతుంది. కాకపోతే కొన్ని శానిటైజర్లు రాసుకున్న కొద్ది సేపటి వరకూ ఆరిపోకుండా ఉంటున్నాయి. ఇది శానిటైజర్ నాణ్యతను బట్టి ఉంటుంది. అలా కాస్త ఆలస్యంగా ఆరిపోయే శానిటైజర్ రాసుకున్నారనుకోండి.. అది ఆరిపోయే లోపు గ్యాస్ వద్దకు వెళ్లకండి.. వెళ్లారంటే పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: