ఆ రాష్ట్రంలో కరోనా అల్ల కల్లోలం చేస్తోంది. ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 200వరకూ పాజిటివ్ కేసులు నమోదు కావడం చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఆ రాష్ట్రం ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. మొదట్లో కేరళలో ఎక్కువ కేసులు నమోదయ్యేవి.. ఇప్పుడు మహారాష్ట్ర ఆ రాష్ట్రాన్ని పాజిటివ్ కేసుల విషయంలో దాటేస్తోంది. ఈ వివరాలను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే మీడియాకు వివరించారు.

 

 

ఇక మహారాష్ట్రలో ప్రాంతాల వారీగా కేసుల వివరాలు చూస్తే.. ఒక్క ముంబై థానే ప్రాంతంలోనే 107 వరకూ కేసులు నమోదయ్యాయి. పుణే ప్రాంతంలో 37, నాగ్‌పూర్‌ ప్రాంతంలో 13 కేసులు నమోదయ్యాయి. మిరాజ్ ప్రాంతంలో 25 కేసులు నమోదయ్యాయి. అహ్మద్ నగర్‌లో, యావత్మాల్‌లో 3 చొప్పున రత్నగిరితో పాటు అనేక ప్రాంతాల్లో ఒక్కో కేసు వెలుగు చూశాయి.

 

 

అయితే మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 34 మంది కరోనా పాజిటివ్ బాధితులు చికిత్స అనంతరం కోలుకోవడం విశేషం. ముంబైలో 14, పుణెల 15, నాగ్‌పూర్‌లో ఒకరు, ఔరంగా బాద్‌లో ఒకరు, యావత్మాల్‌లో ముగ్గురు చొప్పున కోలుకున్నారు. అయితే ఇప్పటి వరకూ మహారాష్ట్రలో కరోనా కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

 

 

ఇక మొత్తం భారత దేశానికి సంబంధించిన గణాంకాలు చూస్తే ఇప్పటి వరకూ.. మొత్తం 979 మంది కరోనా సోకినట్టు నిర్థరించారు. వీరిలో 48 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 25 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: