ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుందని... హోటల్స్, రెస్టారెంట్స్, ఇంకా తదితర టిఫిన్ సెంటర్స్ మొత్తం మూసివేయబడ్డాయని మనకి తెలుసు. అయితే ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ కి చెందిన ఒక యువకుడికి సమోసాలు తినాలనిపించింది. కానీ బయట ఏ సమోసా బండ్లు కనిపించకపోయేసరికి తాను తన ఇంటికి వెళ్లి అత్యవసర అవసరాల కోసం సంప్రదించవలసిన కలెక్టర్ కార్యాలయానికి కాల్ చేశాడు.



ఐతే కాల్ లిఫ్ట్ చేసిన కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో తాను మాట్లాడుతూ... తన ఇంటి అడ్రస్ చెప్పి నాలుగు సమోసాలు పార్సెల్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. మొదట్లో సరదాగా తీసుకున్న కార్యాలయ సిబ్బంది... ' మీరు కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేశారండీ. ఈ నెంబర్ కి కేవలం అత్యవసర అవసరాల కోసమే ఫోన్ చేయాలి' అంటూ ఫోన్ కట్ చేశారు. కానీ సదరు యువకుడు మళ్ళీ ఫోన్ చేసి...తనకి సమోసాలు బాగా తినాలనిపిస్తుందని, తనదీ అత్యవసర అవసరమేనని చెప్పాడు. దాంతో ఆ కార్యాలయ సిబ్బందికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఈ విషయాన్ని రాంపూర్ జిల్లా కలెక్టర్ అనంజయ్ కుమార్ సింగ్ తెలియజేశారు.



దాంతో కలెక్టర్ స్పందిస్తూ... ఏమయ్యా, ఓ యువకుడు సమోసాలు కావాలని ఫోన్ కాల్ చేసి మరీ అడుగుతుంటే పంపించాలన్న ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. పోండి, వెంటనే అతనికి నాలుగు సమోసాలను పార్సెల్ చేయండి' అని అన్నారు. కలెక్టర్ నుండి ఊహించని సమాధానం వచ్చేసరికి అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆపై 4 సమోసాలు పార్సెల్ కి రెడీ చేయగా... కలెక్టర్ మాట్లాడుతూ సమోసాలు తిన్న తర్వాత ఆ యువకుడిని ఇది కూడా చేయమనండి అని చెప్పి పంపించేశారు. యువకుడు చెప్పిన అడ్రస్ కి ఓ జీప్ లో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది చేరుకొని అతనికి 4 సమోసాలు ఇచ్చేశారు. దాంతో కొద్ది సేపటి వరకు షాకైన సదరు యువకుడు ఆ 4 సమోసాలు తిని థాంక్స్ అంటూ చెప్పి ఇంట్లోకి వెళ్ళబోయాడు... అయితే వెంటనే కార్యాలయ సిబ్బంది అతడిని ఆపి ' సమోసాలు తిన్న తర్వాత. నిన్ను ఓ వీధి ఊడ్చి, ఓ డ్రైనేజ్ ని కడగమని మా కలెక్టర్ గారు ఆదేశించారు. ఒకవేళ నీకు ఆ పని చేయడం ఇష్టం లేకపోతే... నువ్వు ఇప్పుడు తిన్న సమోసాలు కక్కేంతవరకు పోలీసులు కొడతారు' అని చెప్పారు.


దాంతో తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్న యువకుడు చేసేదేమి లేక చీపురు పట్టుకొని రోడ్డు ఊడ్చి, డ్రైనేజీ శుభ్రంగా కడిగాడు. ఐతే ఇటువంటి పనికిమాలిన ఫోన్లు ఎవరైనా చేస్తే ఇదే గతి పడుతుందని... కలెక్టర్ యువకుడు డ్రైనేజీ క్లీన్ చేస్తున్న ఫోటో ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి వార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం పైన కనపడుతున్న ఈ ఫోటో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో తెగ వైరల్ అవుతుంది.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: