భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్ ఏది లేకపోవడంతో కోరలు చాస్తూ ఎంతోమందిని బలి తీసుకుంటోంది ఈ మహమ్మారి వైరస్. ఇక ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో  ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ... ఎక్కడ కరోనా  వైరస్ నియంత్రణ మాత్రం జరగడం లేదు. రోజురోజుకు విజృంబిస్తు  ఎంతోమందిని మృత్యువుతో పోరాటం చేసేలా పంజా విసురుతోంది. అయితే ఈ కరోనా  వైరస్ ప్రభావం కేవలం ఒక్క మనుషుల పైన కాదు అన్ని రంగాలపై కూడా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది తీవ్ర నష్టాల్లో కూరుకు పోతున్నారు. 

 

 

 ఇక ఈ మహమ్మారి వైరస్ కారణంగా భారత చిత్ర పరిశ్రమ మొత్తం షట్ డౌన్  అయిన విషయం తెలిసిందే. సినిమా షూటింగులు అన్ని పూర్తిగా నిలిచిపోయాయి. హీరోలు హీరోయిన్లు నటులు అందరూ ఇంటికే పరిమితమై హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా దేశవ్యాప్తంగా లాక్ డౌన్  పరిస్థితుల నేపథ్యంలో సినీ పరిశ్రమ భారీ మొత్తంలో నష్టాలను చవిచూస్తోంది.  థియేటర్లు మూతపడడం షూటింగ్ లు నిలిచిపోవడం లాంటి వివిధ కారణాల దృశ్య సినీ పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్  నిర్మాత గా కొనసాగుతున్న దిల్ రాజు  మిగిలిన వారితో పోల్చుకుంటే కాస్త ఎక్కువగానే నష్టాలూ  ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 ఉగాది పండుగ సందర్భంగా విడుదల కావాల్సిన వి సినిమా వాయిదా పడింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు విలన్ పాత్రలో నాచురల్ స్టార్ నాని నటిస్తుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాను మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఏకంగా ఈ సినిమా కోసం 40 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న వకీల్ సాబ్  సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభించారు. ఈ సినిమాకు కూడా ఇప్పటికే 30 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కరోనా  ఎఫెక్ట్ వల్ల సినిమా చిత్రీకరణ మొత్తం ఆగిపోయింది మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది . ఇక మరోవైపు నిర్మాత దిల్ రాజు చేతిలో కొన్ని థియేటర్లు కూడా ఉన్నాయి.. థియేటర్లు మూసివేసి ఎలాంటి ఆదాయం లేకపోయినా అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించక తప్పదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఉన్న అందరు నిర్మాతలకు అంటే దిల్ రాజు కాస్త ఎక్కువగానే నష్టపోతున్న తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: