ఈ కాలంలో ఆబ్బె మా పిల్లలకి ఆ ఆహారం ఏమి తెలియదమ్మా. ఎప్పుడూ పిజ్జా తోనే వాడు పెరిగాడు అని గొప్పలు చెప్పుకోవడం వింటూనే ఉంటాం. అయితే అవి వట్టి గొప్పలు వాటి వల్ల మిగిలేది కేవలం తిప్పలే.  అయితే ఇలా కాకుండా ఎటువంటి ఆహారం తింటే పిల్లలు బాగా పుష్టిగా తయారు అవుతారు. ఓపిగ్గా ఉంటూ చక్కగా ఆరోగ్యంగా ఎలా ఉండగలరు ?

 

ఇలా చెయ్యడం వల్ల నూటికి నూరు పాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా బలంగా తయారు అవుతారు . ఆలా మీ పిల్లలు కూడా అవ్వాలని మీరు అనుకుంటున్నారా ? అయితే తప్పక దీనిని చూసేయండి. ఎప్పుడూ మన వంట గదిలో వాడుతూనే ఉంటాం. ముఖ్యంగా అనుదినం మనం పోపు లో వేసే ఆవాలు, జీలకర్ర, వాము, ధనియాలు, యాలకులు , మెంతులు. వీటిలో బయటకి తెలియని రహస్యం ఉంటుంది .

 

ముఖ్యంగా  వాము, జీలకర్రలో  జీర్ణశక్తిని పెంపొందించే శక్తి ఉంటుంది.అలానే  వాటి వల్ల జీర్ణ కోశం చక్కగా ఉంటుంది. లవంగాలు , యాలకులు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల . ఇంతే కాక రోజు గ్లాసు పాలు, కాస్త  నెయ్యి, రెండుపూటలా పెరుగు ఇవ్వడం కూడా మంచిది. ఎక్కువగా వీటి ద్వారా ప్రోటీన్స్ లభిస్తాయి.

 

అలానే ఉసిరికాయి, తేనె, పెసలు, వెన్న, నువ్వులు, వివిధ రకాల  పండ్లు, ఆకు కూరలు,  మొదలగు పదార్థములను తీసుకోవడం వల్ల కూడా శక్తి వచ్చి బలంగా ఉంటారు. బాదం, పిస్తా, జీడిపప్పు వంటి నట్స్ కూడా తరచుగా తీసుకోవడం మంచిది. అలానే  ద్రాక్షాలు, ఖర్జూరములు కూడా మంచిది . కాబట్టి తరచూ ఇవి తీసుకుంటూ ఉండాలి. ఫాస్ట్  ఫుడ్స్ వంటివి కూడా తగ్గించడం ఉత్తమం . 

మరింత సమాచారం తెలుసుకోండి: