ఈ నాగారనైకి ఏమైంది ఎప్పుడూ రణగొణ ధ్వనులతో ... బిజీ బిజీగా ఎవరు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు.. కానీ అందరూ హడావుడిగానే కనిపిస్తుంటారు. ఇక కావాల్సిన అంత ధ్వని, వాయు కాలుష్యం. ఎప్పుడో రయ్యి రయ్యి మంటూ దుమ్ములేపుకెళ్లే వాహనాల పొగలు పీల్చుతూ సగటు మానవుడు నగర జీవితానికి అలవాటయిపోయారు. ఇప్పుడు మొత్తం సీన్ అంతా మారిపోయింది. అసలు ఈ నగరానికి ఏమైంది..? కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతూ సతమతం అవుతోంది. ఎక్కడ ఆ ..వీధుల్లోకి వచ్చే పోయే వాహనాలు కనిపించవేమి..? ఆ వాహన ప్రవాహం రోజంతా రయ్ రయ్ మని సాగేది.. ఇప్పుడు ఎక్కడా కనిపించదు ఏమి ..? రోడ్లు దాటాలంటే మొన్నటి వరకు పెద్ద గగనం లా ఉండేది. 

 


మరి ఇపుడో ..?  ఇటూ అటూ చూడకుండా దర్జాగా వెళ్లిపోయేలా అవకాశం ఏర్పడింది. అంతేనా ..?  బయటకు వెళ్లే బస్సులన్నీఎక్కడివక్కడే ఆగిపోయాయి. ప్రయివేటు వాహనాలు మూలాన విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆటోల అడ్రెస్ గల్లంతయ్యింది. రహదారుల్లో రాకపోకలు అన్నీ ఆగిపోయాయి. ప్రతిరోజూ పాజిటివ్, నెగటివ్ కేసుల లెక్కలు, చెవులెన్ని... కేసులెన్ని లెక్కలతోనే టీవీల్లో గోల తప్పించి ఇంకో వార్త కనిపించడేమి..?  కాంక్రీట్ జంగిల్ లో జనసంచారం అంతటా అలుముకుంది. జనాలంతా ఇళ్లకు... టీవీలకు... ఫోన్ లకు అతుక్కుపోయి ప్రపంచం అంతా ఏమైపోతుందో అని ఆసక్తితో తెలుసుకుంటున్నారు. ఇక ఎక్కడలేని శుభ్రతను  పాటించేస్తున్నారు. ఇష్టమైన వంటలన్నీ వండుకుని తినేస్తున్నారు.

 


స్వచ్ఛమైన కాలుష్యం లేని గాలిని పీల్చుతూ హాయిగా సేదతీరుతున్నారు.అసలు ఇటువంటి అనుభూతిని నగర జీవులు ఎవరూ ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవిచ్చిన గుర్తులు లేకపోడంతో ఇదంతా కొత్త కొత్తగా నగర జీవులకు కనిపిస్తోంది. ఒక్క నగరం ఏంటి ...? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ప్రతి నగరంలోనూ ఇదే రకమైన ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రతి పట్టణం ఇప్పుడు ఒక పల్లెల మారిపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: