భారతదేశంలో కరోనా వైరస్  ఎఫెక్ట్  అన్ని రంగాలపై పడిన విషయం తెలిసిందే. ప్రపంచ మహమ్మారి వైరస్ భారత దేశంలో శరవేగంగా విస్తరిస్తూ ఎంతో మందిని బలి తీసుకోవడంతో పాటు... ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది. ఇలా రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని రంగాలు క్రమక్రమంగా దెబ్బతింటున్నాయి. ఇక సినీ పరిశ్రమ కూడా పూర్తిగా షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ఎంతో మంది సూపర్ స్టార్స్ ప్రముఖ సెలబ్రెటీలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. 

 

 

 భారీ బడ్జెట్ సినిమాల తో పాటు చిన్న తిరుమల చిత్రీకరణలో కూడా పూర్తిగా నిలిచిపోయాయి.అటు  భారత ప్రేక్షకులకు ఎంత వెయిట్  చేసిన  ఐపీఎల్ కూడా రద్దయింది.. క్రికెట్ మ్యాచ్ లు కూడా సాగడం లేదు. ఈ నేపథ్యంలో మీడియా కూడా పని తగ్గిపోతుంది. ఎక్కువగా సినిమా పైన ఆధార పడుతూ కొనసాగిన మీడియా సంస్థలకు ప్రస్తుతం అసలు పని లేకుండా పోయింది. సినిమా చిత్రీకరణ పూర్తిగా ఆగిపోవడం తో ఎలాంటి అప్డేట్స్ కూడా రావడం లేదు.. దీంతో సినిమా చుట్టూ తిరిగే మీడియాకు సినిమా లేకుండా పోయింది. 

 

 

 సినిమా చిత్రీకరణ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం కూడా లేకపోవడంతో... ఇక చాలా మీడియా సంస్థలు దివాలా తీసే పరిస్థితి కూడా వస్తున్నాయి. అటు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ న్యూస్ లేక... రాజకీయానికి  సంబంధించిన న్యూస్ లేక.. మరోవైపు కనీసం క్రికెట్ కి సంబంధించింది వార్తలు లేక మీడియా సంస్థలు వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా సినిమా పై ఆధారపడి సినిమాల చుట్టూ తిరిగే మీడియా సంస్థలకు అయితే అసలు సినిమాలే లేకుండా పోయాయి. కరోనా  వైరస్ పుణ్యమా అని ఎటు  తిరిగిన ఎక్కడ చూసినా ఏం చేసినా కరోనా వైరస్ ఈ పేరే వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: