కరోనా వ్యాప్తి అరికట్టేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 14 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న సమయంలో లాక్ డౌన్ ఎత్తివేస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ ఎత్తివేయకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఆర్ధిక పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలు పెట్టి లాక్ డౌన్ ఎత్తివేయచ్చని తెలుస్తోంది.

 

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ఇంకా పొడిగించాలని చెబుతున్నారు. దీనిపై మోదీని కూడా రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో లాక్ డౌన్ కొనసాగిస్తేనే మంచిదని, లాక్ డౌన్‌కు మించి కరోనాకు మరో మెడిసిన్ లేదంటున్నారు. ఒకవేళ ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేశాక, కరోనా విజృంభిస్తే, ఈ 21 రోజులు అనవసరమని అన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగించకపోతే వైకుంఠపాళిలో పైకి వెళ్ళాక పెద్ద పాము మింగేసినట్లు, కరోనా దెబ్బవేస్తుందని వ్యాఖ్యానించారు.

 

నిజానికి కేసీఆర్ చెప్పింది కరెక్ట్. ఇప్పుడు గానీ లాక్ డౌన్ తీస్తే, పరిస్థితులు చేజారిపోయే అవకాశముంది. ఆర్ధిక పరిస్థితులు కోసం చూసుకుంటే అసలకే మోసం వస్తుంది. కాబట్టి ఈ లాక్ డౌన్ కొనసాగించడమే బెటర్ అని కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు భావిస్తున్నాయి. అసలు ఇప్పటికే లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నాయంటూ మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సర్కార్ సూచనప్రాయంగా తెలిపింది.

 

ఇక కేసీఆర్ ఎలాగో లాక్ డౌన్ పొడిగించాలని అంటున్నారు కాబట్టి, తెలంగాణలో కూడా లాక్ డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కొనసాగే అవకాశాలున్నాయి. అటు ఢిల్లీలో కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి, అక్కడ కూడా లాక్ డౌన్ పొడిగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అలాగే తమిళనాడు, ఏపీ, కేరళ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నాయి. మరి చూడాలి లాక్ డౌన్ కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: