ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతూ తనదైన స్టైల్ తో అదిరిపోయే యాక్టింగ్ తో దూసుకు పోతున్నాడు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గంగోత్రి సినిమా తో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన అల్లు అర్జున్... మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసును దోచాడు. ఇక మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో అల్లు అర్జున్ కెరీర్ కు మంచి బాటలు పడ్డాయి . ఇక ఆ తర్వాత విభిన్నమైన యాక్టింగ్ తో అదిరిపోయే డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు అల్లు అర్జున్.

 

 

 అయితే అల్లు అర్జున్ పై ఇప్పటి ఎంతో మంది సినీ ప్రముఖుల ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అల్లు అర్జున్ పై  ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు కురిపించినప్పటికీ.. ఈ  ఏడాది అల్లు అర్జున్ పై సెన్సేషనల్  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కురిపించిన ప్రశంసల వర్షం ఎప్పుడు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ తనదైన స్టైల్లో స్పందిస్తూ అందరిని ఏకిపారేస్తూ  ఉంటాడు రాంగోపాల్ వర్మ. ఎప్పుడు ఎవరిపై ఎలా కామెంట్ చేస్తూ ఉంటారన్నది  ఊహకందని విధంగా ఉంటుంది. 

 

 

 ఇక అల్లు అర్జున్ విషయంలో కూడా రామ్ గోపాల్ వర్మ స్పందించాడు  . ఎప్పుడు అందరికీ నెగిటివ్ కామెంట్ పెట్టే  రాంగోపాల్ వర్మ  మొదటిసారి అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించి  అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అలా వైకుంఠపురము లో. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అయితే ఈ సినిమా హిట్ అనంతరం రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీలో అసలుసిసలైన మెగా పవర్ స్టార్ అల్లు అర్జున్ అని.. అల్లు అర్జున్ కి పోటీ ఎవరు లేరు అన్నట్లుగా వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: