ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు నందినిరెడ్డి. మంచి కథా కథాంశం ఉన్న సినిమాలను తెరకెక్కిస్తోంది అభిమానులో మంచి  అభిప్రాయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం దర్శకురాలు నందిని రెడ్డి సినిమా వస్తుందంటే చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అని సినీ ప్రేక్షకులు భావించేంతగా  ప్రభావితం చేశారు నందిని రెడ్డి. గతేడాది ఓ బేబీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన చిత్రం ఓ బేబీ. 

 

 

 కొరియన్ మూవీ మిస్ గ్రానీ తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలు వృద్ధురాలి గా ఉన్న సమంత యువతి గా మారితే ఎలా ఉంటుంది అనే దానిపై కథ ఆసక్తికరంగా సాగి పోతూ ఉంటుంది. ఇలా ఉంటే ఓ బేబీ లాంటి మంచి విజయాన్ని అందుకున్న దర్శకురాలు నందినీరెడ్డి మరో సినిమా కోసం మంచి కథ సిద్ధం చేసుకున్నదట . ఇక తన కథ కోసం మార్కెట్ బాగా ఉన్న యంగ్ హీరో కావాలని అనుకుందట. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యువ కథానాయకులు అందరూ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో డైరెక్టర్ నందిని రెడ్డి సినిమా కోసం యువహీరో దొరకకపోవడంతో అయోమయంలో పడిందట . ఈ విషయం కాస్త తన స్నేహితురాలు సమంత వరకు వెళ్లడంతో సమంత స్వయంగా ఒక యువ హీరో ని ఈ సినిమా కోసం సెట్ చేసిందట. 

 

 

 సమంత సెట్  చేసిన ఆ హీరో ఎవరో కాదు తన భర్త నాగ చైతన్య. నందిని  రెడ్డి సమంత కాంబినేషన్లో ఓ బేబీ సినిమా వచ్చి  మంచి హిట్ అందుకుంది. కాగా ఈ చిత్రం వీరిద్దరి మధ్య మంచి సాహిత్యాన్ని కూడా పెంచింది. సినిమా కారణంగా వీరిద్దరి మధ్య ఇప్పుడు మంచి స్నేహితులయ్యారు . ఈ క్రమంలోనే లో హీరో కోసం వెతుకుతున్న నందినీ రెడ్డికి తన భర్త నాగచైతన్యను సెట్ చేసిందట  సమంత.  స్వయంగా సమంత నందినీరెడ్డి సినిమా కోసం చెప్పి  ఒప్పించిందని అంటున్నారు. ఇక నాగచైతన్య కూడా తన భార్య సమంత రిక్వెస్ట్ కాదనలేక నందిని రెడ్డి సినిమా కోసం ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు తెలనున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: